పడుకునే ముందు పళ్ళు తోముకోకపోతే తొందరగా చనిపోతారు జాగ్రత్త..

Published : Aug 04, 2022, 05:09 PM IST

నోరు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇంది అందరికీ తెలుసు. ఇందుకోసమే ఉదయమే కాకుండా  నైట్ టైం కూడా బ్రష్ చేస్తుంటారు. నిజానికి నైట్ టైం బ్రష్ చేయడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే..   

PREV
19
 పడుకునే ముందు పళ్ళు తోముకోకపోతే తొందరగా చనిపోతారు జాగ్రత్త..
brushing

మన శరీరంలో ఉండే ప్రతి భాగం పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. రోజు స్నానం చేయడం ఎంత అవసరమో.. ప్రతి రోజూ బ్రష్ చేయడం కూడా అంతే అవసరం. ఎందుకంటే నోటిలో ఎన్నో రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటి వల్ల ఎన్నో రకాల రోగాలొచ్చే ప్రమాదం ఉంది. అందుకే నోటి పరిశుభ్రత ఎంతో అవసరం. మన శరీరంలో నోరు ముఖ్యమైన భాగం. దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉంటే అది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. 

29

నోటి పరిశుభ్రత సరిగ్గా లేకుంటే.. గుండె జబ్బులు, డయాబెటీస్, మూత్రపిండాల అనారోగ్యం, చిత్తవైకల్యం వంటి ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది. వీటి ప్రమాదం తప్పాలంటే.. నోటి శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. 

39

నోటిని పరిశుభ్రంగా ఉంచడం అంత తేలికైన విషయం కాదు. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మంది నోటి సమస్యలైన కావిటీస్, సున్నితత్వం, చిగుళ్ల నొప్పి, చిగుళ్ల వాపు వంటి నోటి సమస్యలతో బాధపడుతున్నారు. 
 

49
Brushing Teeth

పళ్లను సరిగ్గా క్లీన్ చేయడం, దంతవైద్యులను తరచుగా సంప్రదించడం,  ఫ్లోస్, ఆహారాన్ని నియంత్రించడం వల్ల దంత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.  అంతేకాదు వీటివల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. అన్నింటికంటే ముఖ్యమైనదేంటంటే.. దంతాలను క్రమం తప్పకుండా క్లీన్ చేయడం. 

59

కొంతమంది ఉదయమే కాదు.. రాత్రి వేళ కూడా దంతాలను తోముతుంటారు. మరికొంతమంది మాత్రం ఉదయం ఒక్కసారే బ్రష్ చేస్తుంటారు. రాత్రి పూట బ్రష్ చేసుకోరు. దీనివల్ల ఎన్నో నష్టాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. 

69
Brushing

రాత్రిపూట పళ్లను తోమడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. పగటి పూట లాలాజలం సహజ రక్షణ రేఖలా పనిచేస్తుంది. ఇది ఆహారంలోని ఆమ్లాలను తటస్తం చేస్తుంది. అలాగే పంటి ఎనామిల్ దెబ్బతినకుండా కాపాడుతుంది. అయితే రాత్రిపూట ఇది తగ్గుతుంది. అందుకే రాత్రిపూట పళ్లు తోముకోకపోతే నోటిలో బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోతుంది. ఇది దంత క్షయం, చిగుళ్ల వ్యాధి, చెడు శ్వాస వంటి సమస్యలకు దారితీస్తుంది. 

79

నోటి ఆరోగ్యానికి.. మన మొత్తం ఆరోగ్యంతో బలమైన సంబంధం ఉంటుంది. రాత్రిపూట పళ్ళు తోముకోకపోవడం చిగుళ్ల వ్యాధికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోటి ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా రక్తప్రవాహంలో కలిసి గుండెలోకి ప్రవేశిస్తుంది. ఇది సంక్రమణకు దారితీస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు దీనివల్ల శరీర సహజ రక్షణ యంత్రాంగాలకు అంతరాయం కలుగుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. 

89

రాత్రిపూట పళ్లు తోముకోవడం అన్ని వయసుల వారికి అవసరమే. అయితే రాత్రిపూట జస్ట్ ఐదు నిమిషాల పాటు పళ్లను తోమితే సరిపోతుందని డాక్టర్లు సిఫారసు చేస్తారు. 

99

అయితే ఉదయం పళ్లు తోమడంతో పోల్చితే .. రాత్రిపూట పళ్లు తోముకోకపోవ వల్ల మరణ ప్రమాదం 20-35 శాతం పెరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ఎన్ని ఎక్కువ దంతాలుంటే  మరణ ప్రమదం కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దంతాలు లేనివారితో పోల్చితే.. 20 కంటే ఎక్కువ దంతాలున్న వారు రాత్రిపూట పళ్లను తోమకపోవడం వల్ల 30 శాతం ఎక్కువ మరణ ప్రమాదం ఉందని పరిశోధకులు కనుగొన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories