స్పైసీగా, హెల్తీగా స్వీట్ కార్న్ చాట్.. ఓసారి ఇలా ట్రై చెయ్యండి!

Published : Aug 04, 2022, 04:10 PM IST

వర్షాకాలం చల్లటి సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో కలిసి మంచి స్పైసి స్నాక్ తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు స్వీట్ కార్న్ చాట్ ను తయారు చేసుకుంటే సరి..  

PREV
17
స్పైసీగా, హెల్తీగా స్వీట్ కార్న్ చాట్.. ఓసారి ఇలా ట్రై చెయ్యండి!

ఈ స్నాక్ ఐటమ్ చాలా స్పైసీగా (Spicy) భలే రుచిగా ఉంటుంది. ఇది ఆరోగ్యాన్ని అందించే మంచి హెల్తీ స్నాక్. ఈ చాట్ తయారీ విధానం కూడా సులభం. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం స్వీట్ కార్న్ చాట్ (Sweet corn chat) తయారీ విధానం గురించి తెలుసుకుందాం.. 
 

27

కావలసిన పదార్థాలు: ఒక కప్పు స్వీట్ కార్న్ గింజలు (Sweet corn kernels), ఒక ఉల్లిపాయ (Onion), ఒక టమోటా (Tomato), ఒక పచ్చిమిర్చి (Green chilies), మూడు టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ (Corn flour), రుచికి సరిపడా ఉప్పు (Salt), సగం స్పూన్ నల్ల మిరియాల పొడి (Black pepper powder).
 

37

సగం స్పూన్ తెల్ల మిరియాల పొడి (White pepper powder), ఒక స్పూన్ వెల్లుల్లి (Garlic) తరుగు, సగం స్పూన్ కారంపొడి (Chilli powder), కొత్తిమీర (Coriander) తరుగు, ఒక స్పూన్ నిమ్మరసం (Lemon juice), ఢీ ఫ్రైకి సరిపడా నూనె (Oil).
 

47

తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు స్వీట్ కార్న్ గింజలను వేసి బాగా ఉడికించుకోవాలి (Cook well). స్వీట్ కార్న్ బాగా ఉడికిన తరువాత వడగట్టుకుని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇందులో కార్న్ ఫ్లోర్, ఉప్పు, కొద్దిగా నల్ల మిరియాల పొడి, కారం వేసి బాగా కలుపుకోవాలి (Mix well).
 

57

తరువాత రెండు టేబుల్ స్పూన్ ల నీళ్లు (Water) పోసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఢీ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడెక్కిన తరువాత స్వీట్ కార్న్ గింజలను వేసి మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. స్వీట్ కార్న్ గింజలు బాగా ఫ్రై (Fry well) అయిన తరువాత ఒక గిన్నెలో తీసుకోవాలి.
 

67

ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా నల్ల మిరియాల పొడి, తెల్ల మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు (Salt to taste), కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న స్వీట్ కార్న్ గింజలను ఒక గిన్నెలో తీసుకొని నిమ్మరసం (Lemon juice) పిండి సర్వ్ చేయండి.
 

77

అంతే ఎంతో రుచికరమైన (Delicious) నోరూరించే హెల్తీ స్వీట్ కార్న్ చాట్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం ఈ హెల్తీ స్నాక్ (Healthy snack) ఐటెం ను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కుటుంబ సభ్యులతో కలిసి చల్లటి సాయంత్రాన్ని ఆస్వాదించండి..

click me!

Recommended Stories