పచ్చి బఠానీలను ఎక్కువగా తింటున్నారా? అయితే ఈ సమస్యలు రావడం ఖాయం..

First Published Dec 15, 2022, 3:58 PM IST

చలికాలంలో చాలా మంది పచ్చి బఠానీలను ఎక్కువగా తింటుంటారు. నిజానికి పచ్చిబఠానీలు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. అలా అని వీటిని రోజూ తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. 
 

green peas

పచ్చి బఠానీలతో చేసిన వంటలను ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటుంటారు. అందులో చలికాలంలో వీటిని బాగా పండిస్తారు. అందుకే చాలా మంది వీటిని ఎన్నో వంటల్లో వేస్తుంటారు. పలావ్, ఫ్రైడ్ రైస్, చాట్లలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పచ్చి బఠానీలను ఎక్కువగా తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. పచ్చి బఠానీల్లో పోషకవిలువలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని ఎక్కువగా తింటుంటారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే విటమిన్లు, ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి. షుగర్ పేషెంట్లకు ఇవి మంచి మెడిసిన్ లా ఉపయోగపడతాయి. ఎందుకంటే వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంటాయి. పచ్చి బఠానీల ఫైబర్ కు మంచి మూలం. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. బరువు తగ్గేందుకు సహాయపడతాయి. ఆరోగ్యానికి మంచివని మోతాదుకు మించి తినడం ఆరోగ్యానికి అస్సలు మంచివి కావని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. అవేంటంటే.. 


ఉబ్బరం కలిగిస్తాయి

పచ్చి బఠానీలను ఎక్కువ మొత్తంలో తినడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనం ప్రకారం..  పచ్చి బఠానీలలో లెక్టిన్, ఫైటిక్ వంటి కొన్ని యాంటీ న్యూట్రియెంట్స్ ఉంటాయి. ఇవి వాయువు, గాలితో ఉబ్బరంకు దారితీస్తాయి. అయితే బాఠానీల్లో లెక్టిన్ ఎక్కువ మొత్తంలో ఉండదు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో బఠానీలను తింటే మాత్రం ఇది ఎక్కువయ్యి కడుపు ఉబ్బరం కలుగుతుంది. పచ్చి బఠానీలను 1/3 కప్పుకు తగ్గించడం చాలా మంచిది.
 

పోషకాలను తక్కువ శోషణకు దారితీస్తుంది

పచ్చి బఠానీలు పోషకాలతో నిండి ఉంటాయి. కానీ వాటిలో కొన్ని యాంటీ న్యూట్రియెంట్స్ కూడా ఉన్నాయి. పచ్చి బఠానీలలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మీ శరీరంలో ఇనుము, కాల్షియం, జింక్ శోషణను తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు.
 

మూత్రపిండాల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం

పచ్చి బఠానీలలో ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీన్ని పెద్ద పరిమాణంలో తీసుకుంటే మూత్రపిండాల పనితీరును ప్రభావితం అవుతుంది. ఇది కీళ్ల నొప్పులకు కారణమయ్యే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతుంది.
 

బఠానీలు మొత్తమే తినకూడదా?

బఠానీలను ఎక్కువగా తినడం వల్ల సమస్యలు వస్తాయనీ.. వీటిని మొత్తమే మానేయడం సరికాదు. ఎందుకంటే పచ్చి బఠానీలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. అందుకే వీటిని ఖచ్చితంగా మన ఆహారంలో చేర్చుకోవాలి. పచ్చి బఠానీల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదన్నా.. వీటిని మోతాదులోనే తినాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం..
 

green peas

తినే మొత్తాన్ని తగ్గించాలి. 

అలాగే ప్రతిరోజూ బఠానీలు తినకూడదు

వంట చేయడానికి ముందు బఠానీలను నానబెట్టడం, పులియబెట్టడం లేదా మొలకెత్తించడం వల్ల పచ్చి బఠానీలలో లెక్టిన్ కంటెంట్ తగ్గుతుంది.

అందుకే బఠానీలను కాలానుగుణంగా, ఆరోగ్యకరమైన వాటిని తినడానికి ముందు వాటిని తీసుకోవడం వల్ల కలిగే సమస్యల గురించి కూడా ముందే తెలుసుకోవడం మంచిది. 

click me!