మూత్రపిండాలలో మిలియన్ల చిన్న నెఫ్రాన్లు ఉంటాయి. ఇవి రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. మలినాలను తొలగిస్తాయి. దీనివల్ల ఫ్యూచర్ లో రక్తంలో చక్కెర పెరగడం వల్ల మూత్రపిండాలు, నెఫ్రాన్లలో రక్త నాళాలు దెబ్బతింటాయి. ఇది మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. 18 ఏళ్లు పైబడిన వారిలో ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. డయాబెటిస్ ఉన్న ప్రతి నలుగురిలో ముగ్గురికి రక్తపోటు సమస్య ఉంది.
మధుమేహం, ఊబకాయం ఉన్నవారికి తరచుగా రక్తపోటు పెరిగిపోతూ ఉంటుంది. మెటబాలిక్ సిండ్రోమ్ సమస్య కూడా వస్తుంది. మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నవారికి హృదయ సంబంధ వ్యాధులు, ఇతర తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులు వచ్చే ప్రమాదం కూడా ఉంది.