ఆహారం ఆరోగ్యాన్నే కాదు.. మనం ఆనందంగా ఉండేందుకు కూడా సహాయపడుతుంది. ఆహారంలో ఉండే కొన్ని పోషకాలు సెరోటోనిన్, డోపామైన్, ఎండార్ఫిన్లు వంటివి హ్యాపీ హార్మోన్ల విడుదలకు కారణమవుతాయి. కొన్ని ఆహారాలు, పోషకాల సహాయంతో మెదడు.. మానసిక స్థితి, శ్రద్ధను ప్రభావితం చేసే రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలున్న ఆహారాలు మానసిక స్థితిని మెరుగుపర్చడానికి బాగా సహాయపడతాయి. మీకు తెలుసా..? ఆహారంలో పోషకాల లోపం మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంటున్నారు.