గుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీన్ని సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు. గుడ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే ఆరోగ్య నిపుణులు దీన్ని రోజూ తినాలని చెబుతుంటారు. గుడ్లలో విటమిన్ బి12, విటమిన్ డి, కాల్షియం, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అయినా గుడ్లను తినే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.