ఉరుకుల పరుగుల జీవితంలో తమ ఆరోగ్యం గురించి పట్టించుకునే వారిని వేళ్లపై లెక్కపెట్టకోవచ్చంటారు నిపుణులు. ఎందుకంటే లైఫ్ ను ఎలా లీడ్ చేయాలి.. డబ్బులు ఎలా సంపాదించాలి.. అన్న విషయాలపై ఉన్న ఇంట్రెస్ట్ ఆరోగ్యం పై ఉండదు. అందుకే వంద ఏండ్లు బతకాల్సిన వారు అర్థాంతరంగా 50 ఏండ్లలోనే చనిపోతున్నారు. ఎంతైనా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందన్న సామేత ఉత్తిగనే పుట్టలేదు కదా.. మనం ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలి అని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఈ విషయాలను ఆ చెవితో విని ఈ చెవితో వదిలేసి.. జంక్ ఫుడ్ ను, ఫాస్ట్ ఫుడ్ ను రోజూ తినేవారున్నారు. పైగా వీళ్లు శారీరక శ్రమ కూడా చేయరు. మనం చేసే ఈ తప్పులే మన ఆరోగ్యాన్ని రిస్క్ లో పడేస్తాయి. ఈ కారణాల వల్లే మన నరాలు బలహీనపడతాయి. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే మీ నరాలు తిరిగి బలంగా తయారవుతాయి. అవేంటంటే..
డ్రై ఫ్రూట్స్
గింజల్లో ఎన్నో పోషకాలుంటాయి. ఇవి మనకు దివ్య ఔషదంతో సమానం. ఎందుకంటే వీటిలో పుష్కలంగా ఉండే పోషకాలు నరాలను బలోపేతం చేస్తాయి. నరాలను బలంగా చేయడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది డ్రై ఫ్రూట్స్ లో ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇందుకోసం వాల్ నట్స్, బాదం, జీడిపప్పులను మీ రోజు వారి ఆహారంలో చేర్చండి
చేపలు
చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లకు కొదవే ఉండదు. ఇది నరాలను బలోపేతం చేయడంలో ముందుంటుంది. అందుకే నరాలు బలహీనంగా ఉండేవారు తరచుగా చేపలను తింటూ ఉండండి. కొద్ది రోజుల్లోనే మీ నరాలు బలంగా మారుతాయి.
ఆకుపచ్చ కూరలు
ఆకుపచ్చ కూరగాయలను మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు.. వీటిలో ఉండే ఎన్నో రకాల పోషకాలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా ఎన్నో రకాల రోగాలను సైతం పోగొడుతాయి. విటిలో మెగ్నీషియం, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, కాపర్, ఫోలేట్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ నరాలను బలంగా ఉంచుతాయి. శరీరం కూడా బలంగా తయారవుతుంది. అందుకే ఆకుపచ్చ కూరగాయలను మీరోజువారి ఆహారంలో భాగం చేసుకోండి.
హెల్తీ విత్తనాలు
కొన్ని రకాల విత్తనాలు కూడా నరాల బలహీనతను పోగొడుతాయి. ఇందుకోసం అవిసె గింజలు, చియా విత్తనాలు, గుమ్మడి గింజలను రోజూ తినండి. వీటిలో ప్రోటీన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి నరాల బలహీనతను పోగొడుతాయి.
డార్క్ చాక్లెట్లు
డార్క్ చాక్లెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరాన్ని శక్తివంతంగా చేయడంతో పాటుగా మూడ్ స్వింగ్స్ ను పోగొడుతాయి. ఈ చాక్లెట్లలో నరాలను బలంగా మార్చే మెగ్నీషియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది.