రోజూ ఒక ఆపిల్ పండును తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రాదనే మాటను చిన్నప్పటి నుంచీ వినే ఉంటారు. అవును మరీ.. ఆపిల్ పండులో ఉండే పోషకాలు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి. వీటిలో ఫాస్పరస్, విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం, ఇనుము వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో రకాల అంటువ్యాధులను, ఇతర వ్యాధులను దూరంగా ఉంచడానికి సహాయపడుతాయి. ఆపిల్స్ ఎంత ఆరోగ్యకరమైనవైనా.. వీటిని ఎక్కువగా తీసుకోవడం ఏ మాత్రం సేఫ్ కాదు. ఆపిల్స్ ను ఎక్కువగా తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం పదండి..