ఆడవారికి అండాశయ క్యాన్సర్ ముప్పు.. ఈ లక్షణాలతో గుర్తించండి.. సేఫ్ గా ఉంటారు

Published : Sep 15, 2022, 12:53 PM IST

అండాశయాలలో ఏర్పడే కణాల పెరుగుదలే అండాశయ క్యాన్సర్. ఈ కణాలు చాలా వేగంగా పెరుగుతాయి. అందుకే దీన్ని వీలైనంత తొందరగా గుర్తించాలి. లేదంటే మీరు ప్రమాదంలో పడతారు.   

PREV
15
 ఆడవారికి అండాశయ క్యాన్సర్ ముప్పు.. ఈ లక్షణాలతో గుర్తించండి.. సేఫ్ గా ఉంటారు
ovarian cancer

అండాశయంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను చాలా మంది గుర్తించరు. దీంతో ఈ కణాలు దారుణంగా పెరిగిపోయి.. ప్రాణాల మీదికి వస్తుంది. అయితే ఈ క్యాన్సర్ కణాలు ఆరోగ్యకరమైన శరీర కణజాలంపై దాడిచేసి వాటిని నాశనం చేస్తాయి. కుటుంబంలో క్యాన్సర్ వచ్చిన వాళ్లు ఉండటం, వయసు, బరువు, జీవన శైలి వంటివి అండాశయ క్యాన్సర్ తో సంబంధం ఉన్నాయి. కీమోథెరఫీ, శస్త్రచికిత్స ద్వారా దీనికి చికిత్స తీసుకోవచ్చు. 

25

లక్షణాలు

అండాశయ క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందినప్పుడు శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అయితే కొన్ని లక్షణాలు కనిపించినా.. అవి వాటివల్లే వస్తాయని గుర్తించలేరు. ఎందుకంటే అవి ఇతర అనారోగ్య సమస్యల వల్ల కూడా వస్తాయి. అందుకే వీటిని చాలా మంది లైట్ తీసుకుంటారు. దీంతోనే ఈ క్యాన్సర్ కణాలు విపరీతంగా పెరిగిపోతాయి. అండాశయ క్యాన్సర్ సంకేతాలు..లక్షణాలేంటో తెలుసుకుందాం పదండి.. 

పొత్తికడుపు వాపు, నొప్పి

కొంచెం తిన్నా కడుపు నిండిపోతుంది. 

బరువు తగ్గడం

కటి ప్రాంతంలో అసౌకర్యం

వెన్ను నొప్పి

అలసట

మలబద్దకం

తరచుగా మూత్రవిసర్జన చేయడం

35
ovarian cancer

కారకాలు: అండాశయ క్యాన్సర్ కు కారణాలేంటో స్పష్టంగా తెలియవు. కానీ ఈ వ్యాధిని పెంచే విషయాలను వైద్యులు గుర్తించారు.  

అండాశయాలలో ఈ క్యాన్సర్ కణాలు పుట్టుకొస్తాయి. ఇవి చాలా వేగంగా పెరుగుతాయి. ఆరోగ్యకరమైన కణాలు చనిపోయినప్పుడు ఈ క్యాన్సర్ కణాలు ఇంకా జీవిస్తూనే ఉంటాయి. ఇవి సమీపంలో ఉండే కణజాలాలపై దాచి చేస్తాయి. 

అండాశయ క్యాన్సర్ రకాలు

ఎపిథీలియల్ అండాశయ క్యాన్సర్: ఇది సర్వసాధారణమైన క్యాన్సర్ రకం. ఇది సెరస్ కార్సినోమా, మ్యూసినస్ కార్సినోమాతో సహా ఎన్నో ఉప రకాలను కలిగి ఉంటుంది.

స్ట్రోమల్ కణితులు: ఇవి చాలా అరుదైన కణితులు. సాధారణంగా ఇవి ఇతర అండాశయ క్యాన్సర్ కంటే ప్రారంభ దశలోనే గుర్తించబడతాయి. 

జెర్మ్ సెల్ ట్యూమర్లు: ఇది అరుదైన అండాశయ క్యాన్సర్. ఇవి చాలా చిన్నవయసులోనే సంభవిస్తాయి. 

45
ovarian cancer

ప్రమాద కారణాలు

వృద్ధాప్యం:  వయస్సు పెరిగే కొద్దీ అండాశయ క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే ఇది ఎక్కువగా వృద్ధులలోనే నిర్ధారణ అవుతుంది.

వంశపారంపర్యంగా వచ్చే జన్యు మార్పులు:  మీ తల్లిదండ్రుల నుంచి మీరు వారసత్వంగా పొందే జన్యువుల మార్పుల వల్ల కూడా అండాశయ క్యాన్సర్ రావొచ్చు. అయితే ఇది చాలా తక్కువ శాతం. అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే జన్యువుల్లో బిఆర్ సిఎ1 , బిఆర్ సిఎ2 లు ఉన్నాయి. ఈ జన్యువులు బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.  లించ్ సిండ్రోమ్, బి.ఆర్.ఐ.పి.1, ఆర్.ఎ.డి.51 సి, ఆర్.ఎ.డి 51 డి జన్యువులతో సంబంధం ఉన్న జన్యు మార్పులతో సహా ఎన్నో ఇతర జన్యు మార్పులు అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

55
Ovarian cancer

అండాశయ క్యాన్సర్ కుటుంబ చరిత్ర: మీ రక్త సంబంధీకుల్లో ఎవరికైనా అండాశయ క్యాన్సర్ ఉన్నట్టైతే అది మీకు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 

అధిక బరువు లేదా ఊబకాయం: ఓవర్ వెయిట్ లేదా ఊబకాయం కూడా అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. 

రుతుక్రమం ఆగిపోయిన హార్మోన్ రీప్లేస్ మెంట్ థెరపీ తీసుకోవడం: రుతువిరతి సంకేతాలను, లక్షణాలను నియంత్రించడానికి హార్మోన్ రీప్లేస్ మెంట్ థెరపీని తీసుకోవడం వల్ల అండాశయ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

రుతుస్రావం ప్రారంభై ముగిసే వయస్సు: చిన్న వయస్సులోనే రుతు విరతి ప్రారంభమైతే కూడా అండాశయ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. 

మీరు ఎప్పుడూ ప్రగ్నెంట్ కాకపోతే:  మీరు ఎప్పుడూ గర్భవతి కానట్లయితే.. మీకు అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా వరకు పెరుగుతుంది.
 

click me!

Recommended Stories