Health Tips: ఇష్టమని చికెన్ ను ఎక్కువగా లాగించేస్తున్నారా? దీనివల్ల మీరు ఎంత ప్రమాదంలో పడుతున్నారో తెలుసా?

First Published Jan 23, 2022, 12:02 PM IST


Health Tips:చికెన్ ఫ్రై, చికెన్ 65, చికెన్ మంచురియా, చికెన్ బిర్యాని అంటూ చికెన్ తో ఏది వండినా కాదనకుండా లాగించేవారు చాలా మందే ఉన్నారు.  ప్రతి రోజు చికెన్ తినమన్నా.. ఎలాంటి మొహమాటం లేకుండా చికెన్ తినేవారున్నారు.  కానీ ప్రతి రోజూ చికెన్ తినడం వల్ల ఎంత ప్రమాదం పొంచి ఉందో వీరికి తెలియదు కాబోలు.. క్రమం తప్పకుండా చికెన్ తింటే కలిగే నష్టాలేంటో తెలుసా..


Health Tips: అన్ని రకాల నాన్ వెజ్ లల్లో చికెన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. ఎందుకంటే మటన్, ఫిష్ ప్రియులకంటే చికెన్ ప్రియులే అధికం. చికెన్ తో చేసిన ఏ ఐటెం అయినా సరే ఇష్టంగా తింటుంటారు. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, గ్రిల్ చికెన్, గోంగూర చికెన్, చికెన్ బిర్యాని అంటూ ఎన్నో రకాల చికెన్ ఐటెమ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. అందులోనూ ఈ చికెన్ Healthyపౌల్ట్రీ ఐటెం గా కూడా పేరుపొందింది. అంతేకాదు చికెన్ తినడం వల్ల మనకు ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి.  అలాగని ప్రతి రోజూ అదే పనిగా చికెన్ తింటే ప్రమాదంలో పడ్డట్టే. ఎంత ఇష్టమైన ఆహారమైనా సరే అది పరిమితిగా తింటేనే ఆరోగ్యానికి మంచిది. అలాగే చికెన్ కూడా పరిమితిలోనే తీసుకోవాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే నిత్యం చికెన్ తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 

అన్ని నాన్ వెజ్ ఐటెమ్స్ లల్లో చికెన్ వేడిని కలిగిస్తుందని మనకు తెలిసిందే. చికెన్ తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీని వల్ల కొందరికి వేసవిలో కూడా జలుబు చేస్తుంది. ముఖ్యంగా ప్రతి రోజూ చికెన్ తింటే ముక్కులోంచి బ్లడ్ కూడా వస్తుంది. అలాంటి వారు ప్రతి రోజూ లేదా తరచుగా చికెన్ తినే అలవాటును మానుకోవాలి. కొన్ని రోజుల వరకు దీనికి దూరంగా ఉండటం చాలా బెటర్. 
 

మోతాదుకు మించి చికెన్ తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇది మీరు చికెన్ తినే విధానంపై పైనే ఆధారపడి ఉంటుంది. అంటే డీప్ ఫ్రైడ్ చికెన్ ను నిత్యం తింటే మీ శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది. వైట్ మీట్ చికెన్ను రెడ్ మీట్ చేసే పద్దతే శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి ప్రధాన కారణమని Study of the American Journal of Clinical Nutrition తెలుపుతోంది. చికెన్ తిన్నా కొలెస్ట్రాల్ రాకూడదంటే ఉడకబెట్టిన లేదా, కాల్చిన చికెన్ ను తినాలి. అదికూడా పరిమితిగానే తినాలి. 


రోజు క్రమం తప్పకుండా చికెన్ తినడం వల్ల బరువు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. చికెన్ తో చేసే చికెన్ బిర్యాని, చికెన్ ఫ్రై, బటర్ చికెన్ వంటి ఆహారపదార్థాల్లో కేలరీలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఇక వీటిని తినడం వల్ల బరువు పెరగడం పక్కాగా జరుగుతుంది. అందుకే ప్రతి రోజూ కాకుండా అప్పుడప్పుడు మాత్రమే తినడం మంచిది. కానీ ప్రతి రోజూ అదే పనిగా తింటే మాత్రం అధిక బరువు పెరగడం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ కూడా విపరీతంగా పెరుగుతుంది. 
 

రెగ్యులర్ గా చికెన్ తీసుకుంటే యూరినరీ ఇన్ ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. అలాగే UTIఇన్ఫెక్షన్ లో పాటుగా ఇతర ఇన్ ఫెక్షన్లకు చికెన్ దారి తీస్తుందని అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ జర్నల్ వెళ్లడించింది. ఇలాంటి ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే యాంటీ బయాటిక్స్ వాడని చికెన్ తినాలని నిపుణులు చెబుతున్నారు. 

click me!