మధుమేహన్నీ తగ్గించే బీరకాయ.. ఇది తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Navya G   | Asianet News
Published : Jan 23, 2022, 11:35 AM IST

బీరకాయలో (Beerakaya) అనేక పోషకాలు ఉంటాయి. బీరకాయతో చేసుకునే వంటలు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. బీరకాయ పొట్టుతో కూడా పచ్చడి చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు మనం బీరకాయను తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల (Health benefits) గురించి తెలుసుకుందాం..  

PREV
111
మధుమేహన్నీ తగ్గించే బీరకాయ.. ఇది తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

బీరకాయలో ఫైబర్, విటమిన్ సి, జింక్, మెగ్నీషియం, ఐరన్, థియామిన్ (Thiamine), రిబోఫ్లేవిన్ (Riboflavin), బీటా కెరోటిన్ వంటి ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇన్ని పోషకాలు కలిగిన బీరకాయలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతారు. 
 

211

కంటిచూపును మెరుగు పరుస్తుంది: బీరకాయలో బీటా కెరోటిన్ (Beta carotene) సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని (Eye health) మెరుగుపరచడానికి సహాయపడుతుంది. వయసు పైబడటంతో వచ్చే దృష్టి లోపాన్ని తగ్గించి కంటిచూపును మెరుగుపరుస్తుంది.
 

311

మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది: తాజా బీరకాయలో సెల్యులోజ్ (Cellulose), నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది ప్రేగులలో పేరుకుపోయిన మలాన్ని తేలికపరిచి మలవిసర్జన సాఫీగా జరగడానికి సహాయపడి మలబద్ధకం (Constipation) సమస్యలను తగ్గిస్తుంది.
 

411

బరువును తగ్గిస్తుంది: బీరకాయలో అసంతృప్తి కొవ్వు పదార్థాలు, కొలెస్ట్రాల్ (Cholesterol), కేలరీలు తక్కువగా ఉంటాయి. బీరకాయలను తింటే కడుపు నిండిన భావన కలిగి ఎక్కువ సార్లు ఆహారాన్ని తీసుకోవాలనిపించదు. దీంతో బరువు తగ్గుతారు (Lose weight).
 

511

చర్మ సంరక్షణకు మంచిది: బీరకాయలలో యాంటీఆక్సిడెంట్లు (Antioxidants) సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేసి మొటిమలు, మచ్చలను తొలగించి చర్మాన్ని తాజాగా ఉంచుతాయి. కనుక చర్మ సంరక్షణ (Skin care) కోసం బీరకాయలను తీసుకోవడం మంచిది.
 

611

కామెర్లను నివారిస్తుంది: కామెర్లను (Jaundice) తగ్గించే సామర్థ్యాన్ని (Capacity) బీరకాయలు కలిగి ఉంటాయి. కనుక కామెర్లతో బాధపడేవారు బీరకాయలను గింజలతో సహా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 

711

డయాబెటిస్ ను తగ్గిస్తుంది: బీరకాయలోని పోషకాలు రక్తంలో, యూరిన్ లో చక్కెర స్థాయిలను (Sugar levels) కలవకుండా అడ్డుకుంటాయి. అంతేకాకుండా రక్తంలో ఇన్సులిన్ లెవల్స్ ను స్థిరంగా ఉంచి డయాబెటిస్ (Diabetes) ను తగ్గించడానికి సహాయపడుతుంది.
 

811

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: అనారోగ్యం కారణంగా నీరసించిన శరీరానికి తక్షణ శక్తిని అందించడానికి బీరకాయను జ్యూస్ రూపంలో తీసుకోవడం మంచిది. ఇది ఇన్ఫెక్షన్ (Infection), వైరస్ వంటి వాటి నుంచి శరీరాన్ని కాపాడే రోగనిరోధక శక్తిని (Immunity) పెంచుతుంది.
 

911

ఉదర సమస్యలను తగ్గిస్తుంది: బీరకాయలో సమృద్ధిగా ఉండే సెల్యులోజ్ ఉదర భాగాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపు నొప్పి, కడుపులో మంట, వికారం వంటి ఉదర సంబంధిత సమస్యలను (Abdominal problems) తగ్గించడంతోపాటు ఫైల్స్ (Files) నివారణలో కూడా అద్భుతంగా సహాయపడుతుంది.
 

1011

కాలేయ సమస్యలను తగ్గిస్తుంది: శరీరంలోని కలుషితమైన రక్తాన్ని శుద్ధి (Refine blood) చేయడానికి బీరకాయ సమర్ధవంతంగా సహాయపడుతుంది. బీరకాయ కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి కాలేయ సమస్యలను (Liver problems) తగ్గిస్తుంది.
 

1111

శరీర వేడిని తగ్గిస్తుంది: బీరకాయలోని ఔషధ గుణాలు ఆమ్లత్వంను తగ్గించడంతోపాటు పూతలు, అల్సర్ (Ulcer) వంటి సమస్యను తగ్గించి శరీరానికి చలువను అందించి వేడిని తగ్గిస్తుంది. మూత్రంలో మంట (Inflammation in the urine), నొప్పి వంటి సమస్యలను సులభంగా తగ్గించడానికి సహాయపడుతుంది.

click me!

Recommended Stories