Omicron Variant: మీ కళ్లలో ఈ తేడా కనిపించిందా? అది ఒమిక్రాన్ కావొచ్చు.. జాగ్రత్త..!

First Published Jan 23, 2022, 10:46 AM IST

Omicron Variant:జ్వరం, దగ్గు, జలుబు, నీరసం వంటివి ఒమిక్రాన్ లక్షణాలని మనకు తెలిసిందే. అయితే కొత్తగా ఒమిక్రాన్ లక్షణాలు కళ్లలో కూడా కనిపిస్తున్నాయంట. అది ఎలాగంటే..
 

omicron

Omicron Variant: ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. ఒక వైపు కరోనా (corona), మరోవైపు ఒమిక్రాన్ ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాలను కరోనా థర్డ్ వేవ్ చుట్టేసింది. దీనికి తోడు ఒమిక్రాన్ కేసులు కూడా ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అందులో మన దేశంలో కూడా ఒమిక్రాన్ విలయతాండవం చేస్తుంది. రోజుకు వేళల్లో కేసులు నమోదవడం ప్రజలను మరింత భయబ్రాంతులకు గురిచేస్తోంది. 

అయితే ఒమిక్రాన్ లక్షణాలు అంత తీవ్రస్థాయిలో లేకపోయినా.. రికార్డు స్థాయిలో కేసులు పెరగడం ఆందోళన కలిగించే విషయమే. అయితే ఈ కొత్త వేరియంట్ సోకిందని.. తీవ్రమైన జ్వరం, జలుబు, గొంతునొప్పి, తలనొప్పి, నీరసం, విరేచనాలు వంటి లక్షణాలతో నిర్దారించుకోవాలని మనకు తెలసిందే. అయితే తాజా పరిశోధనలో ఈ వేరియంట్ కంటి మీద కూడా ప్రభావం చూపిస్తుందని తెలిసింది. కళ్లలో కలిగిన వివిధ మార్పుల ద్వారా కూడా ఈ వేరియంట్ సోకిందని నిర్దారించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. 

లక్షణాలు: కళ్లలో ఒమిక్రాన్ లక్షణాలు తక్కువ మొత్తంలో కనిపించే ఛాన్సెస్ ఉన్నాయని నిపుణులు వెళ్లడిస్తున్నారు. మీరు ఒమిక్రాన్ బారిన పడితే.. మీ కళ్లు గులాబీ రంగులోకి మారుతాయి. అలాగే తెలుపుగా కూడా మారొచ్చు. అలాగే ఈ వేరియంట్ సోకితే కళ్లలో మంటలు రావడం, కనురెప్పలు వాపు రావడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు కళ్లలో నొప్పి, మంటలు, కళ్లు ఎర్రగా మారడం వంటివి కూడా ఒమిక్రాన్ లక్షణాలుగానే నిర్ధారించారు. మరికొందరిలో అయితే కళ్లు సరిగ్గా కనిపించకపోవడం అంటే మసకగా, కళ్లలో నీళ్లు కారడం కూడా జరగవచ్చు. 

కాగా ఒమిక్రాన్ సోకిన వారిలో కంటికి సంబంధించి సమస్యలే 5 శాతం ఉన్నట్టు నిపుణులు నిర్దారించారు. అయితే ఈ లక్షణాలు కనిపిస్తే ఒమిక్రాన్ సోకిందని పూర్తిగా నిర్దారించలేము. ఇతర కారణాల వల్ల కూడా ఇలాంటి కంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఏదేమైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ముందస్తు జాగ్రత్తగా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఒకవేళ ఇది ఒమిక్రాన్ కాదని నిర్దారణ అయితే కంటి సంరక్షణ చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ కంటి సమస్యలకు కొన్ని సింపుల్ చిట్కాల ద్వారా కాస్త ఉపశమనాన్ని పొందవచ్చు. కాటన్ క్లాత్ ను లేదా కాస్త దూదిని కాని తీసుకుని నీళ్లలో తడిపి కంటిమీద తుడవాలి. తరచుగా ఇలా చేస్తే ఈ సమస్యల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. 

click me!