బాదం పప్పులు ఆరోగ్యానికి మంచివే.. కానీ వీళ్లు మాత్రం తినకూడదు..

First Published Oct 3, 2022, 11:27 AM IST

బాదం పప్పుల ప్రయోజనాలు అందరికీ తెలిసిందే. బరువు తగ్గడం నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిండంలో బాదం పప్పులు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అయినప్పటికీ బాదం పప్పులు కొంతమంది ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. 

బాదం పప్పుల తినడం ద్వారా మనం పొందే ప్రయోజనాలు అన్నీ.. ఇన్నీ కాదు. ఇవి దాదాపుగా అందరికీ తెలుసు. కానీ బాదం పప్పుల వల్ల వచ్చే నష్టాలు మాత్రం ఎవరికీ తెలియవేమో.. అసలు మా ఆరోగ్యానికి ఇవి మంచివా.. కావా ? అన్న ముచ్చట తెలుసుకోకుండా బాదం పప్పులను ఇష్టంగా తినే వారున్నారు. మీకు తెలుసా.. బాదం పప్పులు కూడా ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. 

బాదంపప్పులో ఎన్నో రకాల పోషకాలుంటాయి. కార్భోహైడ్రేట్లు, మెగ్నీషియం, ప్రోటీన్, కాల్షియం, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ అజీర్థి, మలబద్దకం సమస్యలను తగ్గిస్తుంది. ఇది కడుపును ఎక్కువగా సేపు నిండుగా ఉంచుతుంది. దీంతో మీరు సులువుగా బరువు తగ్గుతారు. ఇక కాల్షియం ఎముకలను, దంతాలను బలంగా ఉంచేందుకు సహాయపడుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది యాంటీ ఏజింగ్ గా పని చేస్తుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. మెమరీ పవర్ ని పెంచుతుంది. 

almond

ఇక బరువు తగ్గాలని బాదం పప్పులను తినే వారు కూడా ఉన్నారు. కానీ బరువు తగ్గాలంటే వీటిని ఎక్కువగా తినకపోవడమే మంచిది. మీరు ఫాస్ట్ గా బరువు పెరుగుతున్నట్టైతే.. బాదం పప్పులను మొత్తమే తినకూడదు. ఎందుకంటే బాదం పప్పులు కేలరీలను పెంచుతాయి. దీంతో మీరు స్థూలకాయం బారిన పడే అవకాశం ఉంది. ఈ పప్పులు శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తాయి. అయినప్పటికీ బరువు తగ్గాలని బాదం పప్పులను ఎక్కువగా తింటుంటారు. బరువు తగ్గాలనుకునే వారు రోజుకు నాలుగైదు బాదం పప్పులను మాత్రమే తినాలి. ఇంతకు మించి తింటే బరువు పెరిగిపోతారు. 

రోజూ బాదం పప్పులను తినకుండా ఉండలేని వారు చాలా మందే ఉన్నారు. ఈ అలవాటును మానుకోవడం మంచిది. అలాగే బాదం పప్పులను ఎక్కువగా తినడం కూడా మంచిది కాదు. మోతాదుకు మించి బాదం పప్పులను తింటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. ఎందుకంటే కిడ్నీల్లో రాళ్లకు కారణమయ్యే ఆక్సలేట్ బాదం పప్పుల్లో ఎక్కువ మొత్తంలో ఉంటుంది. 

బాదం పలుకుల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మోతాదులో తీసుకుంటే అజీర్థి సమస్యలు పోతాయి. అదే మోతాదుకు మించి తీసుకుంటేనే మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఎందుకంటే మన పొట్ట ఎక్కువ ఫైబర్ ను జీర్ణం చేసుకోలేదు. దీని వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది. 

జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలేవైనా ఉంటే బాదం పప్పులు ఎక్కువగా తినకండి. బాదంలో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి. వీటిని మీ పొట్ట అంత సులువుగా జీర్ణం చేసుకోలేదు. దీని వల్ల అజీర్ణం లేదా జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయి.

almond

కొంతమందికి బాదం పప్పులను తింటే కూడా అలెర్జీ వస్తుంది. ఒకవేళ మీకు అలెర్జీ సమస్య ఉంటే బాదం పప్పులకు దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే అలర్జీలు కొన్నిసార్లు పెరిగి గొంతుకు చేరుతాయి. దీని వల్ల ఏదీ తినలేరు.

ఎసిడిటీ ఉంటే కూడా బాదం పప్పులను మొత్తమే తినకూడదు. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు కూడా వీటిని తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిని తింటే కిడ్నీ స్టోన్స్ మరింత ఎక్కువ అవుతాయి. అలాగే హైబీపై పేషెంట్లు కూడా వీటిని తినకూడదు. ఎందుకంటే బీపీ తగ్గేందుకు మందులు వాడుతూ.. వీటిని తింటే ఆరోగ్యం  మరింత దెబ్బతింటుంది. 

click me!