ప్రతి మహిళకు నెలసరి రావడం చాలా సహజం. ఒక్కొక్కరికి ఒక్కో తేదిన ఈ నెలసరి అవుతుంది. అయితే కొంతమందికి కిందటి నెల ఏ తేదీన అయ్యిందో.. వచ్చే నెలలో కూడా అదె రోజు కావొచ్చు. కానీ ఇంకొంత మందికి మాత్రం పోయిన నెలకు రెండు రోజుల ముందే లేదా ఆ తర్వాత కూడా కావొచ్చు. ఏదేమైనా రెండు మూడు రోజుల వ్యత్యాసంలో పీరియడ్స్ రావడం మాత్రం పక్కా. ఇక ఈ పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో నొప్పి, మూడ్ స్వింగ్స్, చిరాకు, ఒత్తిడి వంటి సమస్యలు సర్వసాధారణం. ఇక ఈ నెలసరి సమయంలో దేవుడి గుడికి అసలే వెళ్లరు. అంతెందుకు ఈ సమయంలో ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇష్టపడరు. ముందే ఇది పండుగ సీజన్. ఈ సమయంలో నెలసరి కాకూడదని మందులను వాడే వారు చాలా మందే ఉన్నారు.