ఎడమ మైపు తిరిగి పడుకోవడం లేదా? మీరెన్ని బెనిఫిట్స్ ను మిస్ అవుతున్నారో తెలుసా?

Published : Oct 03, 2022, 09:26 AM IST

ఆరోగ్యంగా ఉండేందుకు నిద్ర చాలా అవసరం. నిద్రతో పాటుగా ఎటువైపు తిరిగి నిద్రపోతున్నామనేది కూడా ముఖ్యమే. అందులో ఎడమ వైపు పడుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయో తెలుసా..  

PREV
15
ఎడమ మైపు తిరిగి పడుకోవడం లేదా? మీరెన్ని బెనిఫిట్స్ ను మిస్ అవుతున్నారో తెలుసా?

ఈ గజిబిజీ లైఫ్ లో చాలా మంది స్ట్రెస్ తో కూడిన లైఫ్ నే లీడ్ చేస్తున్నారు. దీనివల్ల ఎన్నో మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇది మీ నిద్రను కూడా దెబ్బతీస్తుంది. మరీ ముఖ్యంగా కంటినిండా నిద్రలేకపోవడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. నిద్ర మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గంటలైనా నిద్రపోవాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. నిద్రపోవడమే కాదు నిద్రపోయే భంగిమ కూడా ముఖ్యమేనంటున్నారు నిపుణులు. దీనివల్ల చేతులు, కాళ్లు మాత్రమే కాదు, మెదడు కూడా దెబ్బతింటుంది. అయితే ఎడమ వైపున పడుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

25

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

మన శరీరంలోని క్లోమం ఎడమ వైపునే ఉంటుంది. అందుకే ఎడమ వైపు తిరిగి పడుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇటు తిరిగి పడుకోవడం వల్ల హాయిగా నిద్రపోతారు. గురుత్వాకర్షణ శక్తి ఆహారం కడుపు గుండా ప్రయాణించడాన్ని సులభతరం చేస్తుంది. అలాగే ఆహార వ్యర్థాలను బయటకు పంపేందుకు కూడా సహాయపడుతుది. జీర్ణం కాని ఆహారం చిన్న పేగు నుంచి పెద్ద పేగుకు కదులుతుంది. రాత్రంతా ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్లే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. మీ జీర్ణక్రియ మెరుగ్గా జరగాలంటే ఎడమవైపున తిరిగి పడుకోండి. ఇలా పడుకోవడం వల్ల శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

35

గుండె ఆరోగ్యం బాగుంటుంది

మన గుండె ఎడమ వైపునే ఉంటుంది. కాబట్టి ఎడమ వైపునకు తిరిగి పడుకోవడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే గుండె వైపు రక్తం సజావుగా ప్రవహిస్తుంది. గుండె నుంచి కొంత బరువును తొలగించి, శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో గుండెకు రక్త సరఫరా జరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటేనే రక్తం, ఆక్సిజన్ సరఫరా మొత్తం శరీరానికి బాగా జరుగుతుంది. ఎడమ వైపున తిరిగి పడుకోవడం వల్ల మీ గుండె పనితీరు మెరుగుపడుతుంది.
 

45

గర్భిణీ స్త్రీలకు మంచిది

గర్భిణులు వీలైనంత వరకు ఎడమ వైపు తిరిగి పడుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది వారి వీపుపై ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే గర్భాశయానికి, పిండానికి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. వెన్నెముకపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇలా పడుకోవడం వల్ల హాయిగా నిద్రపడుతుంది కూడా. అంతేకాదు బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు ప్లాసెంటాకు పోషకాలు బాగా అందేలా చూస్తుంది కూడా.
 

55

గురకను తగ్గిస్తుంది

మీరు నమ్మినా.. నమ్మక పోయినా.. ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల  గురక వచ్చే ఛాన్సే ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ పొజీషన్ నాలుక, గొంతును తటస్థ స్థితిలో ఉంచుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేకుండా వాయు మార్గాలను క్లియర్ చేస్తుంది. ఇది కాస్త గురకను తగ్గిస్తుంది. వెల్లకిలా పడుకుంటే గురక రావడం సాధారణం. ఎందుకంటే ఈ పొజీషన్ లో నాలుక, నోరు, దవడ పూర్తిగా సడలించబడతాయి. కాబట్టి వీపుపై పడుకోవడం వల్ల గురక వస్తుంది. గురక వచ్చే వాళ్లు ఎడమవైపు తిరిగి పడుకోవడం మంచిది. 

Read more Photos on
click me!

Recommended Stories