Mosquito: చాలామంది దోమను చేత్తో కొట్టి చంపుతారు. కానీ ఆ చేతులను మాత్రం శుభ్రం చేసుకోరు. ఇది తీవ్రమైన సమస్యలకు కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు.
మనదేశంలో దోమలు ఎక్కువ. ప్రతి ఇంట్లోని దోమలు కనిపిస్తాయి. ఇంట్లో, ఆఫీసులో, పార్కులో ఎక్కడ కూర్చున్నా చుట్టూ దోమలు కుడుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి మనం వాటిని చేతులతోనే చంపేస్తాం.. కానీ ఆ చేతులను శుభ్రం మాత్రం చేసుకోము. ఇలా చేయకపోవడం వల్ల తరచూ అనారోగ్యానికి గురై అవకాశం ఉంది ఎన్నో రకాల సమస్యలు కూడా రావచ్చు.
24
దోమలను అరచేతితో చంపాక
దోమలను అరచేతులతో చంపిన తర్వాత ఆ చేతులను శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. దోమలు రక్తం పీల్చడమే కాదు అనేక ప్రమాదకరమైన వ్యాధులను మోసుకొని తిరుగుతూ ఉంటాయి. దోమలు వాటి శరీరాలు, కాళ్లపై బ్యాక్టీరియా, వైరస్, పరాన్న జీవులను కలిగి ఉంటాయి. మీరు ఎప్పుడైతే దోమను అరచేతితో కొట్టారో.. అప్పుడు ఆ దోమలోని వైరస్ లు, బ్యాక్టీరియాలు, పరాన్న జీవులు మీ చేతి చర్మానికి అంటుకుంటాయి. ఆ సమయంలో మీ చేతిలో చిన్న గాయం, కోత వంటివి ఉన్నా చాలు ఆ సూక్ష్మజీవులు శరీరంలోకి చేరి ఇన్ఫెక్షన్ కు కారణం అవుతాయి. కాబట్టి వెంటనే శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
34
చర్మ సమస్యలు
దోమలను చేతితో కొట్టి చంపాక రక్తం లేదా వాటి శరీర అవశేషాలు మీ అరచేతికి అంటుకుంటే అలెర్జీ కలగవచ్చు. అక్కడ దురద, దద్దుర్లు వంటివి రావచ్చు. అలాగే ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కూడా కలగవచ్చు. ఆహారం తినడానికి ముందు కచ్చితంగా చేతులను పరిశుభ్రంగా కడగండి. అలాగే దోమలను చేత్తో కొట్టిన తర్వాత ముఖాన్ని తాకడం వంటి పనులు చేయవద్దు. లేకుంటే ఆ క్రిములు నోటి నుంచి జీర్ణవ్యవస్థలోకి చేరి కడుపునొప్పికి, వాంతులకు, విరేచనాలకు కారణం అవుతాయి.
దోమల ద్వారా ఎన్నో వ్యాధులు సంక్రమిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, జికా వైరస్ వంటివి. ఇవి తీవ్రమైన అనారోగ్యాలు బారిన పడేలా చేస్తాయి. చనిపోయిన దోమలను తాకడం వల్ల ఈ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. అందుకే దోమను చంపిన తర్వాత మీరు ఎప్పుడు మీ చేతుల్ని సబ్బుతో శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నించండి.