Karthika Masam: కార్తీక మాసంలో ఒక్కసారైనా నదీ స్నానం చేయాల్సిందే.. అలా చేస్తే ఎంతటి పుణ్యమో తెలుసా?

Published : Oct 26, 2025, 08:01 AM IST

Karthika Masam: కార్తీక మాసం వచ్చేసింది. నదులకు దగ్గరగా ఉండేవారు ప్రతిరోజూ నదీ స్నానం చేస్తారు. కానీ దూరంగా ఉండే వారికి కుదరదు. కానీ కార్తీకమాసంలో ఒక్కరోజైనా నదీస్నానం చేయిస్తే ఎన్నో పుణ్య ఫలితాలు కలుగుతాయి. 

PREV
16
పవిత్ర కార్తీకమాసం

కార్తీక మాసం హిందూ మతంలో ఎంతో పుణ్యకాలం. తెల్లవారుజామునే తలకు స్నానం చేసి దీపారాధన చేస్తే పుణ్యఫలితాలు కలుగుతాయని చెబుతారు. కార్తీకమాసంలో శివకేశవుల అనుగ్రహం కోసమే భక్తులు పూజలు చేస్తారు. ముఖ్యంగా పరమేశ్వరుడిని అధికంగా పూజిస్తారు. అయితే కార్తీకమాసంలో కచ్చితంగా చేయాల్సిన పని నదీ స్నానం.

26
నదీ స్నానం

నదులకు, చెరువులకు దగ్గరగా ఉండే వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజూ నదీ స్నానం చేయడానికి వీలుంటుంది. కానీ పట్టణాల్లో నగరాల్లో ఉన్నవారికి నదీ స్నానం అంత సులువు కాదు. కానీ కార్తీకమాసం ముగిసే లోపు ఒక్కసారైనా నదీ స్నానం చేస్తే మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది. తెల్లవారుజామున చేసే నదీ స్నానం మీ ఆత్మను శుద్ధి చేస్తుందని చెబుతారు. అలాగే సూర్యోదయానికి ముందు చేసే నదీ స్నానం గత జన్మలో చేసిన పాపాలను కడిగి వేస్తుందని అంటారు.

36
త్రిమూర్తులు నదీజలాల్లోనే

గంగా, గోదావరి, కృష్ణా వంటి పుణ్య నదులకు దగ్గరగా ఉండేవారు కచ్చితంగా నదీ స్నానం చేసేందుకు ప్రయత్నించండి. ఇది మీకు శక్తిని జీవితంలో అందిస్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కార్తీక మాసంలో నదీ జలాలలోనే కలిసి ఉంటారని అంటారు. అందుకే నదీ స్నానం చేయడం వల్ల మీకు ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక శక్తి కూడా కలుగుతుంది. కార్తీక స్నానం గురించి పద్మ పురాణంలోనూ, స్కంద పురాణంలో కూడా వివరించారు.

46
దామోదర మోసం

కార్తీక పురాణంలో కార్తీక మాసంలో నదీ స్నానం మహత్యాన్ని ఎంతగానో వివరించారు. కార్తీక మాసంలో నదీ స్నానం చేయడం వల్ల ఎన్నో పాపాలు చేసిన వారు కూడా పుణ్యమూర్తులుగా మారుతారు. తల్లితండ్రులను బాధపెట్టిన వారు నదీ స్నానం చేస్తే ఆ పాపం నుంచి విముక్తిని పొందవచ్చు. కార్తీకమాసాన్ని దామోదర మాసం అని కూడా అంటారు. ఈ మాసంలో చేసే నది స్నానం ఎంతో అత్యధిక ఫలితాన్ని అందిస్తుంది.

56
బ్రహ్మ ముహూర్తంలో స్నానం

పురాణాల ప్రకారం కార్తీకమాసంలోనే ఆకాశ గంగా నదుల్లోకి చెరువుల్లోకి చేరుతుందని అంటారు. అలాగే ఈ మాసంలో వర్షాల వల్ల నదులు, చెరువులు నిండి కళకళలాడుతూ ఉంటాయి. కాబట్టి ఆ నీరు ఎంతో పవిత్రమైనది కూడా. నది జలాల్లోని స్నానం ఆరోగ్యాన్ని అందిస్తుందని చెబుతారు. నది స్నానాన్ని బ్రహ్మ ముహూర్తంలో చేయడం మంచిది. కార్తీకమాసంలో బ్రహ్మ ముహూర్తంలో చేసిన స్నానం ఇచ్చే ఫలితం అధికం.

66
ఇంట్లో కూడా ఇలా స్నానం

నదులు అందుబాటులో లేని వారు ఇంటిలో ఉన్న బావి నీటితో కూడా స్నానం చేయవచ్చు. అది కూడా బ్రహ్మ ముహూర్తంలో అనే స్నానం చేస్తే 12 ఏళ్లు పుణ్య నదీలో స్నానం చేసిన ఫలితం కలుగుతుందని చెబుతారు. ఇక బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లోనే ఉన్న సాధారణ చన్నీళ్లతో స్నానం చేసినా కూడా ఆరు సంవత్సరాల పాటు పుణ్య నదుల్లో చేసిన స్నాన ఫలితం దక్కుతుందని అంటారు. ఇక నదీ స్నానం చేస్తే 96 ఏళ్ల పాటు పుణ్య నదీ స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. కాబట్టి కార్తీకమాసంలో ఒక్కసారి అయినా నదీ స్నానం చేసేందుకు ప్రయత్నించండి.

Read more Photos on
click me!

Recommended Stories