Pan for Dosa: దోశెలు క్రిస్పీగా రావాలంటే ఇనుప పెనం వాడాలా? లేక నాన్‌స్టిక్ పెనం వాడాలా?

Published : Aug 09, 2026, 09:29 AM IST

Pan for Dosa: ఉదయం టిఫిన్‌లో దోశ ఇష్టంగా తినేవారే ఎక్కువ. అయితే ఏ పెనంపై దోశెలు టేస్టీగా వస్తాయి. ఇనుప పెనం వాడాలా లేక నాన్‌స్టిక్ పెనం వాడాలా? ఈ రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను ఇక్కడ తెలుసుకోండి.

PREV
13
ఇనుప పెనం వాడితే ఏమవుతుంది?

గ్రామాల్లో ఇప్పటికీ దోశెలు వేసేందుకు ఇనుప పెనమే వాడతారు. అయితే కొత్తగా ఇనుప పెనం తీసుకున్నప్పుడు కొన్ని పనులు ముందుగా చేసి దాన్ని వంటకు సిద్ధం చేయాలి. పెనానికి నూనె రాసి వేడి చేయాలి. తరవాత చల్లారాక దాన్ని వాడాలి. వాడిన తరువాత నీళ్లు లేకుండా పూర్తిగా ఆరబెట్టాలి. కొద్దిగా నూనె రాసి పెడితే తుప్పు పట్టకుండా ఉంటుంది. సరిగ్గా మెయింటెయిన్ చేయకపోతే దోశ అంటుకోవడమే కాకుండా, పెనంపై తుప్పు కూడా పట్టొచ్చు. చాలామంది పెద్దలకు ఇనుప పెనంపై కాల్చిన దోశ చాలా రుచిగా ఉంటుందని ఇష్టం. సరైన మోతాదులో నూనె వాడి, పిండి పర్ఫెక్ట్‌గా ఉంటే కరకరలాడే దోశలు సులభంగా వస్తాయి. అయితే నాన్ స్టిక్ తో పోలిస్తే ఇనుప పెనాన్ని శుభ్రం చేయడం కొంచెం కష్టం. దాన్ని సరిగా చూసుకోకపోతే తుప్పు పట్టేస్తుంది. ఇనుప పెనంపై తుప్పు పడితే, దానికి నూనె రాసి సరిచేసుకోవాలి.

23
నాన్ స్టిక్ పెనం వాడితే ఏమవుతుంది?

నాన్‌స్టిక్ పెనం వాడడం చాలా సులువు. దోశ పిండి వేయగానే సులభంగా స్ప్రెడ్ చేయొచ్చు. దోశ అంటుకోకుండా వచ్చేస్తుంది. వంట కొత్తగా నేర్చుకునేవారికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇనుప పెనంతో పోలిస్తే తక్కువ నూనెతోనే వంట చేయొచ్చు. అందుకే తక్కువ నూనె వాడాలనుకునే వారికి నాన్‌స్టిక్ పెనమే మంచిది. అలాగని దీన్ని ఎలా పడితే అలా వాడకూడదు. దానిపై ఉండే కోటింగ్ దెబ్బతినకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా స్టీల్ గరిటెలు, కత్తులు వంటివి వాడితే గీతలు పడతాయి. దీనిపై చెక్క, సిలికాన్ గరిటెలను మాత్రమే వాడాలి. ఖాళీ పెనాన్ని ఎక్కువ మంటపై ఎక్కువసేపు వేడి చేయకూడదు.

33
ఏ పెనం కొనాలి?

ఇనుప పెనం కొనాలా లేక నాన్ స్టిక్ పెనం కొనాలా అని ఆలోచిస్తున్నారా? మీకు కరకరలాడే దోశలు, ఎక్కువ కాలం మన్నిక, సంప్రదాయమైన వంట ఇష్టమైన నాణ్యమైన ఇనుప పెనం ఎంపిక చేసుకోవడం మంచిది. సులువుగా వాడుకోవడం, తక్కువ నూనె, తేలికైన క్లీనింగ్, తక్కువ బరువు ఇవన్నీ చూసుకుంటే నాన్‌స్టిక్ పెనం కొనడం మంచిది. కొన్ని ఇళ్లలో రెండింటినీ వాడుతూ ఉంటారు. కానీ కరకరలాడే టేస్టీ దోశెలు కావాలంటే మాత్రం ఇనుప పెనం అన్ని విధాలా మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories