Saree Reuse: పాత చీరలను పడేస్తున్నారా? ఇలా చేస్తే డబ్బు ఆదా.. అద్భుతమైన లుక్ మీ సొంతం!

Published : May 28, 2026, 12:01 PM IST

Saree Reuse: చీరల ట్రెండ్ ఎప్పటికప్పడు మారిపోతూ ఉంటుంది. ఒకటి, రెండుసార్లు కట్టుకున్న చీరను మళ్లీ కట్టుకోవడానికి చాలామంది ఇష్టపడరు. కానీ జాగ్రత్తగా దాచిపెడతారు. కాస్త క్రియేటివ్ గా ఆలోచిస్తే వాటితో మోడ్రన్ డ్రెస్సులు కుట్టించుకోవచ్చు. ఎలాగో చూద్దాం. 

PREV
16
పాత చీరలతో మోడ్రన్ డ్రెస్సులు

చీరలు ఆడవాళ్లకు ప్రత్యేకమైన అందాన్ని ఇస్తాయి. అందుకే ట్రెండ్ కి తగ్గట్టుగా కొంటూనే ఉంటారు. దానివల్ల చాలా చీరలు బీరువాలో మిగిలిపోతుంటాయి. చాలామంది మహిళలు ఒకసారి ఫంక్షన్‌కు కట్టిన చీరను మళ్లీ వాడకపోవడం లేదా స్టైల్ అవుట్ అయిందని పక్కన పెట్టడం చేస్తుంటారు. కానీ వాటిని చాలా అందమైన, ట్రెండీ, మోడ్రన్ డ్రెస్సులుగా మార్చుకోవచ్చు. ఏ చీరలను ఎలాంటి డ్రెస్సులు కుట్టించుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

26
ఈ స్టైల్లో డ్రెస్ కుట్టిస్తే..

పాత చీరలను రీయూజ్ చేసే మొదటి బెస్ట్ ఐడియా వాటిని కుర్తీలు లేదా అనార్కలీ డ్రెస్సులుగా మార్చడం. సిల్క్, కాటన్, జార్జెట్ వంటి చీరల్లో మంచి ఫాబ్రిక్ ఉంటుంది. వాటిని టైలర్ వద్ద ఇచ్చి స్టైలిష్ అనార్కలీ డ్రెస్సులుగా కుట్టించుకోవచ్చు. ప్రత్యేకంగా బోర్డర్ ఉన్న చీరలు లేదా ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న చీరలు డిజైనర్ లుక్ ఇస్తాయి. అలాంటి చీరలను మోడ్రన్ కట్‌తో డిజైన్ చేస్తే చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తాయి. ఇవి ఫంక్షన్స్‌, పార్టీస్‌కి చాలా బాగా సూట్ అవుతాయి.

36
లాంగ్ స్కర్ట్స్

పాత చీరలను లాంగ్ స్కర్ట్స్‌గా కూడా కుట్టించుకోవచ్చు. ప్రస్తుతం వెస్ట్రన్ ఫ్యాషన్‌లో ఫ్లోరల్ లేదా ప్రింటెడ్ లాంగ్ స్కర్ట్స్ చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. అదే విధంగా పాత చీర ఫాబ్రిక్‌ను ఉపయోగించి హై-వెస్ట్ స్కర్ట్స్, ప్లీటెడ్ స్కర్ట్స్ లేదా మాక్సీ స్కర్ట్స్ కుట్టించుకోవచ్చు. వీటిని సింపుల్ టాప్ లేదా క్రాప్ టాప్‌తో స్టైల్ చేయవచ్చు. 

46
బ్లౌజ్ డిజైనింగ్

చాలామంది దగ్గర ఖరీదైన చీరలు ఉంటాయి. కానీ బ్లౌజులు మాత్రం సరిగ్గా ఉండవు. అలాంటి సందర్భాల్లో చీర ఫాబ్రిక్‌తో కొత్త ట్రెండీ బ్లౌజ్‌లు కుట్టించుకోవచ్చు. ఆఫ్-షోల్డర్, బిషప్ స్లీవ్స్, పఫ్ స్లీవ్స్, బ్యాక్ ఓపెన్ డిజైన్స్ వంటి మోడ్రన్ స్టైల్‌లను ట్రై చేయవచ్చు. ఇది చీరకే కాదు, ఇతర డ్రెస్సులతో కూడా మ్యాచ్ చేసుకోవచ్చు.

56
దుపట్టా లేదా స్టోల్స్

పాత చీరలను దుపట్టాలు లేదా స్టోల్స్‌గా కూడా రీయూజ్ చేయవచ్చు. సాఫ్ట్ సిల్క్ లేదా లైట్‌వెయిట్ చీరలను కట్ చేసి దుపట్టాలుగా మార్చితే కుర్తీలు, జీన్స్, వెస్ట్రన్ డ్రెస్సులపైకి సెట్ చేసుకోవచ్చు. ఇది సింపుల్, స్టైలిష్ లుక్ ఇస్తుంది. అలాగే చీరల బోర్డర్‌లతో బ్యాగ్స్, క్లచ్‌లు లేదా హ్యాండ్‌మెడ్ యాక్సెసరీస్ కూడా తయారు చేసుకోవచ్చు.

66
స్టైలిష్ లుక్

కాస్త క్రియేటివ్ గా ఆలోచిస్తే, ఇలా పాత చీరలతో కూడా రకరకాల మోడల్స్ లో డ్రెస్సులు కుట్టించుకోవచ్చు. సరైన టైలర్ లేదా డిజైనర్ సహాయంతో ఏ పాత చీర అయినా అందమైన మోడ్రన్ అవుట్‌ఫిట్‌గా మారిపోతుంది. బయట కొనుగోలు చేసే దుస్తుల కంటే వీటిని మనం తక్కువే ధరకే కుట్టించుకోవచ్చు. అద్భుతమైన లుక్ పొందవచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories