ఎందుకీ అసంతృప్తి?
1. పని ఒత్తిడి. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే, వేర్వేరు సమయాల్లో పనిచేస్తే భార్యాభర్తలు కలవడం కూడా కష్టమవుతుంది. కొత్తగా పెళ్లయిన వాళ్ళు ఇంతకుముందు రోజూ కలిసి కూర్చునేవాళ్ళు. దానివల్ల ఇద్దరి మధ్య అనుబంధం పెరిగేది. కానీ ఇప్పుడు కూర్చోవడం కాదు కదా, కలిసి పడుకోవడం కూడా తగ్గిపోయింది. కొత్తగా పెళ్లయిన వాళ్ళు కూడా వారానికి ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే కలుస్తున్నారు. అంత పని ఒత్తిడి ఉంటోంది. బెడ్‌రూమ్‌లోకి కూడా ఉద్యోగం తలనొప్పి వస్తుండటంతో సరదాగా గడపడానికి మనసు, శరీరం సహకరించడం లేదు.
పరిష్కారాలు: పని మధ్యలో కాస్త విరామం తీసుకోవాలి. ఆఫీసులు ఇంటి దగ్గరలో ఉంటే మంచిది. ఇద్దరూ కలిసి కొత్త హాబీలు ట్రై చేయాలి. ఇద్దరికీ ఇష్టమైన పనులు చేయాలి. కలిసి వంట చేయడం వల్ల కూడా ప్రేమ పెరుగుతుంది.