Hair Growth: ఈ ఐదు రాస్తే.. జుట్టు పెరగడం తప్ప, ఊడటం ఉండదు

జుట్టు ఒత్తుగా పెరగాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. అయితే, దాని కోసం వేల రూపాయలు ఖర్చు చేయకుండా, సింపుల్ గా ఇంట్లో కొన్ని రెమిడీలు ప్రయత్నిస్తే చాలు అని నిపుణులు చెబుతున్నారు. మరి, అవేంటో చూద్దామా...

పొడవాటి జుట్టు ఇష్టపడని అమ్మాయిలు ఎవరైనా ఉంటారా? మరీ మోకాళ్ల పొడవు లేకపోయినా.. ఉన్న కాస్త జుట్టు అయినా అందంగా, ఒత్తుగా ఉండాలనే ఆశపడతారు. కానీ, ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు అలాంటి ఆశ ఉన్నా.. అది ఆశగానే మిగిలిపోతోంది. జుట్టు అందంగా కనిపించాలంటే దాని కోసం వేలల్లో ఖర్చు పెట్టాలి అనే భావన చాలా మందిలో మొదలైంది. కానీ.. పెద్దగా ఖర్చు లేకుండా  ఇంట్లోని కొన్నింటి జుట్టుకు రాయడం వల్ల.. మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నింటికీ  చెక్ పెట్టొచ్చు. మరి, ఏం రాయాలో, వేటితో కలిపి రాయాలో తెలుసుకుందామా..

1. మెంతులు-కొబ్బరి నూనె హెయిర్ మాస్క్

మెంతులు జుట్టు ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడతాయి. ఈ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, ఆ మెంతులను మాత్రం ఎలా వాడాలో తెలుసుకోవాలి. జస్ట్ మెంతుల పేస్టు తలకు పట్టించడం కంటే.. కొబ్బరి నూనెతో కలిపి హెయిర్ మాస్క్ తయారు చేసి.. దానిని వాడటం వల్ల జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.

కావాల్సినవి:

2 టేబుల్ స్పూన్ల మెంతులు

3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె

తయారీ విధానం: మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయం వాటిని మెత్తని పేస్ట్‌లా రుబ్బుకోండి. కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి, మెంతుల పేస్ట్‌తో బాగా కలపండి.

ఉపయోగించే విధానం: ఈ మాస్క్‌ను మీ జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి, 5-10 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయండి. మెంతులు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. 30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. వారానికి ఒకసారి ఈ హెయిర్ కేర్ మాస్క్‌ను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.


2. అవకాడో-బనానా హెయిర్ మాస్క్

అవకాడో, బనానా హెయిర్ మాస్క్ కాంబినేషన్ కూడా జుట్టుకు బలాన్ని ఇస్తుంది. ఈ రెండింటితో హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలో చూద్దాం

కావాల్సినవి:

1 పండిన అవకాడో

1 పండిన అరటిపండు

1 టేబుల్ స్పూన్ తేనె

తయారీ విధానం: అవకాడో, అరటిపండును మెత్తగా పేస్ట్‌లా చేయండి. తేనెను కలిపి బాగా కలపండి. ఉండలు లేకుండా చూసుకోండి.

ఉపయోగించే విధానం: ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించండి. ఇది జుట్టును బలంగా, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. 20-30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి. వారానికి ఒకసారి ఇలా చేయండి.

3. కలబంద-ఆముదం హెయిర్ మాస్క్:

ఆముదం జుట్టును నల్లపడనివ్వదు. ఎక్కువ కాలం తెల్ల జుట్టు రాకుండా కాపాడుతుంది. ఇక.. కలబంద జుట్టుకు మంచి కండిషనర్ లా పని చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి తయారు చేసిన హెయిర్ మాస్క్ తో జుట్టు చాలా అందంగా మారుతుంది. ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.

కావాల్సినవి:

2 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు

1 టేబుల్ స్పూన్ ఆముదం

తయారీ విధానం: కలబంద ఆకు నుండి గుజ్జును తీసి, ఆముదంతో బాగా కలపండి.

ఉపయోగించే విధానం: ఈ మిశ్రమాన్ని మీ జుట్టు కుదుళ్లకు పట్టించి 5 నిమిషాలు మసాజ్ చేయండి. 45 నిమిషాల నుండి గంట వరకు అలాగే ఉంచి, ఆ తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

4. ఉల్లిపాయ-తేనె హెయిర్ మాస్క్ :

ఉల్లిపాయ జుట్టు పెరగడంలో బాగా సహాయపడుతుంది. అంతేకాదు.. జుట్టు రాలే సమస్య కూడా తగ్గిస్తుంది. అలాంటి ఉల్లిపాయతో తేనె కూడా కలిపి మాస్క్ వేయడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది.

కావాల్సినవి:

2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ రసం (ఉల్లిపాయను తురిమి రసం తీయాలి)

1 టేబుల్ స్పూన్ తేనె

తయారీ విధానం: ఉల్లిపాయ రసం, తేనెను ఒక గిన్నెలో వేసి బాగా కలపండి. వాసన ఎక్కువగా ఉంటే, కొన్ని చుక్కల లావెండర్ లేదా రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ వేయవచ్చు.

ఉపయోగించే విధానం: ఈ మిశ్రమాన్ని మీ జుట్టు కుదుళ్లకు సమానంగా పట్టించండి. 20-30 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఉల్లిపాయ రసంలో సల్ఫర్ ఉంటుంది, ఇది జుట్టును బలంగా, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. వాసన పోయే వరకు షాంపూతో శుభ్రంగా కడగాలి.

5. ఉసిరి-కొబ్బరి నూనె హెయిర్ మాస్క్:

కావాల్సినవి:

2 టేబుల్ స్పూన్ల ఉసిరి పొడి

3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె

తయారీ విధానం: కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి, ఉసిరి పొడితో కలిపి చిక్కటి పేస్ట్‌లా చేయండి. మిశ్రమం వేడిగా ఉండకుండా చూసుకోండి.

ఉపయోగించే విధానం: ఈ పేస్ట్‌ను మీ జుట్టు కుదుళ్లకు సున్నితంగా మసాజ్ చేస్తూ పట్టించండి. 30-40 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత తేలికపాటి హెర్బల్ షాంపూతో కడగాలి. ఉసిరిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి, కుదుళ్లను బలంగా చేస్తాయి.

Latest Videos

click me!