కరోనా కట్టడికి ఈ మాస్కులే కీలకం..

First Published Jan 24, 2022, 1:17 PM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. దీని బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు సూచిస్తున్నారు. అందులో ఈ మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు మాస్కులే కీలకమని నిపుణులు తేల్చి చెప్పారు. అలాగని చాలా మంది క్లాత్ మాస్కులనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ వీటిని ధరించడం వల్ల కరోనా నుంచి ఎలాంటి రక్షణ పొందలేమని నిపుణులు తేల్చి చెబుతున్నారు. కరోనా నుంచి మనల్ని సురక్షితంగా ఉంచడంలో ఈ మాస్కులే ఉపయోగపడతాయని..
 

కరోనా నుంచి మనల్ని మనం సురక్షితంగా ఉంచుకోవడంలో మాస్కులే కీలకమని నిపుణులు ఇప్పటికే తేల్చి చెప్పారు. అందుకే జనాలు సైతం మాస్కులను ధరించడం అలవాటు చేసుకున్నారు. అయితే మాస్కులల్లో క్లాత్ తో చేసిన మాస్కులనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ ఈ క్లాత్ మాస్కులు మనల్ని ఎంత మాత్రం రక్షించవు. అలాగే మరింత ప్రమాదంలోకి తోసే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా కొవిడ్ నుంచి మనల్ని మరింత సురక్షితంగా ఉంచడంలో రెస్పిరేటర్ లు బాగా ఉపయోగపడతాయని నిపుణులు వెళ్లడిస్తున్నారు. ఈ రెస్పిరేటర్లు అంటే.. మన వ్యక్తిగత రక్షణ కోసం, గాలిలో ఉండే ప్రమాదకరమైన వైరస్ లు, కలుషితాలు మన శరీరంలోకి ప్రవేశించకుండా చేసే ఒకరకమైన మాస్కులని అర్థం. 
 

KN95 मास्क

అందులోనూ కొత్త వైరస్ ఒమిక్రాన్ ఇప్పటికే ప్రపంచ దేశాలను చుట్టుముట్టింది. అందులోనూ ఆస్ట్రేలియాతో సహా ఇతర దేశాలు సైతం కరోనా నుంచి తప్పించుకునేందుకు ఈ రెస్పిరేటరీ మాస్కులను తప్పని సరిగా ధరించాలని సూచిస్తున్నాయి. ఎందుకంటే ప్రాణాంతమైన కరోనా నుంచి ఈ మాస్కులే సేఫ్ గా ఉంచగలవని. అందుకే ఆస్ట్రేలియాతో పాటుగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న ఇతర దేశాల్లో ఖచ్చితంగా FFP2 మాస్కులను తప్పని సరిగా ధరించాలని పేర్కొంటున్నాయి. అన్ని మాస్కులకంటే ఈ రెస్పిరేటరీ మాస్కులే అత్యంత సురక్షితమని  US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) గుర్తించింది. అంతేకాదు కొవిడ్ నుంచి బయటపడటానికి మాస్కులను అప్ గ్రేడ్  చేయాలని సూచిస్తోంది. 

అధ్యయనాల ప్రకారం.. కరోనా సోకిన వ్యక్తి రెస్పిరేటర్ మాస్క్ ను ధరించడం వల్ల ఇన్ఫెక్షన్ నుంచి 25 గంటల పాటు రక్షించబడతాడు. అదే క్లాత్ మాస్క్ ను ధరించడం వల్ల 26 నిమిషాల్లోనే కరోనా సోకుందని నిపుణులు తేల్చి చెప్పారు. కరోనా నుంచి సురక్షితంగా ఉంచడంలో    N95 రెస్పిరేటర్లు, సర్జికల్ మాస్కులు ప్రధాన పాత్ర పోషిస్తాయని Centers for Disease Control and Prevention తెలుపుతోంది. ఈ మాస్కులు కలుషిత వాతావరణం నుంచి రక్షణకల్పిస్తాయి.  
 

జాగ్రత్తలు: గుండె కు సంబంధించిన వ్యాధులు లేదా శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు ఈ మాస్కులను ఉపయోగించే ముందు వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే ఈ మాస్కులు పెట్టుకునే వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ మాస్కులు సింగిల్ యూజ్ గా తయారుచేయబడ్డాయి. ఒక సారి పెట్టుకున్న మాస్కులు మురికిగా, లేదా పాడైపోతే మళ్లీ ఉపయోగించకూడదు. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తినా వీటని పాడేయడం ఉత్తమం. ఒక సారి వాడిన మాస్కులను తిరిగి ఉపయోగించకూడదు. అలాగే వీటిని పారేసిన తర్వాత మీ చేతులను శానిటైజ్ చేసుకోవడం మరవొద్దు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మాస్కులు చిన్న పిల్లల కోసం తయారుచేయబడలేదు. సో వాళ్లకు ఇవి పెట్టకూడదు. అలాగే ముఖంపై వెంట్రుకలు ఉండే వారు వీటిని పెట్టుకోకపోవడం ఉత్తమం. ఎందుకంటే వారికి ఈ మాస్కులు ఫిట్ కావు కాబట్టి.  

click me!