Raincoat: వర్షాకాలంలో ఎప్పుడు వర్షం పడుతుందో చెప్పడం కష్టం. బయటకు వెళ్లిన సమయంలో ఆకస్మికంగా వర్షం కురిస్తే తడవకుండా ఉండేందుకు ప్రతీ చోటుకి రెయిన్ కోట్ తీసుకెళ్లడం కష్టం. అలాంటి వారి కోసమే అమెజాన్‌లో ఓ అద్భుతమైన ప్రొడక్ట్ అందుబాటులో ఉంది.
మీటూ డిస్పోబుల్ ఎమర్జెన్సీ బాల్ రెయిన్ కోట్ (MeeTo Disposable Emergency Ball Raincoat) పేరుతో చిన్న బాల్ రూపంలో ఉండే ఈ రెయిన్‌కోట్‌ను బ్యాగ్, పర్స్ లేదా బెల్ట్‌కు తగిలించుకుని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఈ ఉత్పత్తి ప్రత్యేకత దాని డిజైన్. సాధారణ రెయిన్‌కోట్‌ల మాదిరిగా ఎక్కువ స్థలం ఆక్రమించదు. చిన్న గుండ్రటి బాల్ ఆకారంలో ప్యాక్ చేస్తారు. అవసరం వచ్చినప్పుడు బాల్‌ను తెరిస్తే అందులో ఉన్న రెయిన్‌కోట్‌ను వెంటనే ఉపయోగించుకోవచ్చు. అందుకే దీనిని ఎమర్జెన్సీ రెయిన్‌కోట్‌గా పిలుస్తారు. ధర విషయానికొస్తే అమెజాన్ లో కేవలం రూ. 139కే అందుబాటులో ఉంది.
25
ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు..
ఈ రెయిన్‌కోట్ PVC మెటీరియల్‌తో తయారు చేస్తారు. నీరు లోపలికి రాకుండా రక్షణ కల్పిస్తుంది. బరువు చాలా తక్కువగా ఉండటంతో ప్రయాణాల్లో, ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు, స్కూల్ బ్యాగ్‌లో లేదా ట్రెక్కింగ్ సమయంలో సులభంగా తీసుకెళ్లవచ్చు. కీచైన్ తరహా హుక్ ఉండటం వల్ల బ్యాక్‌ప్యాక్, హ్యాండ్‌బ్యాగ్ లేదా బెల్ట్‌కు తగిలించుకోవచ్చు.
35
పురుషులు, మహిళలు ఇద్దరికీ సరిపోతుంది
ఈ రెయిన్‌కోట్ ఫ్రీ సైజ్‌లో అందుబాటులో ఉంటుంది. పురుషులు, మహిళలు ఇద్దరూ ఉపయోగించవచ్చు. హుడ్‌తో కూడిన డిజైన్ ఉండటం వల్ల తల, మెడ భాగాలు కూడా వర్షం నుంచి రక్షణ పొందుతాయి. ఎరుపు, పింక్, పసుపు, నీలం, తెలుపు, ఊదా వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.
ఈ ఎమర్జెన్సీ రెయిన్‌కోట్‌ను అనేక సందర్భాల్లో ఉపయోగించవచ్చు. ట్రావెలింగ్, ట్రెక్కింగ్, క్యాంపింగ్, సైక్లింగ్, ఫిషింగ్, జాగింగ్, స్పోర్ట్స్ ఈవెంట్స్, కచేరీలు, బహిరంగ కార్యక్రమాలు, థీమ్ పార్కులు, వాటర్ పార్కులు, ఆకస్మిక వర్షం పడినప్పుడు వెంటనే ధరించేందుకు ఇది మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది.
55
పిల్లలు, ప్రయాణికులకు మంచి ఎంపిక
పిల్లలు స్కూల్‌కు వెళ్లేటప్పుడు లేదా కుటుంబంతో బయటకు వెళ్లినప్పుడు ఎప్పుడైనా వర్షం పడే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఈ బాల్ రెయిన్‌కోట్ ఉపయోగపడుతుంది. పెద్ద రెయిన్‌కోట్ మోసుకెళ్లాల్సిన అవసరం లేకుండా చిన్న బాల్ రూపంలో ఎప్పుడూ వెంట ఉంచుకోవచ్చు. తక్కువ స్థలం ఆక్రమించడం, తక్కువ బరువు, నీటి నిరోధకత వంటి లక్షణాలు దీనిని బెస్ట్ ప్రొడక్ట్‌గా మార్చాయి.