ఇంటిని శుభ్రం చేయడానికి...
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కిటికీలు, అద్దాలతో చేసిన ఏవైనా వస్తువులు ఉండే ఉంటాయి. వాటికి పట్టిన మురికి అంత సులభంగా వదలదు. మార్కెట్లో దొరికే ఖరీదైన లిక్విడ్స్ తెచ్చి శుభ్రం చేస్తూ ఉంటారు.కానీ, వాటి అసవరం లేకుండా.. ఈ న్యూస్ పేపర్లతో శుభ్రం చేయచ్చు. న్యూస్ పేపర్ మీద కాస్త వెనిగర్ వేసి.. డైనింగ్ టేబుల్, కిటికీలు, అద్దాలను శుభ్రం చేస్తే..కొత్త వాటిలా మెరిసిపోతాయి.
అంతేకాకుండా... మీ ఇంట్లో కబోర్డ్స్, వంట గది క్యాబిన్స్, పుస్తకాల అరలు, దుస్తుల కింద.. న్యూస్ పేపర్ వేయాలి. ఇలా చేయడం వల్ల దుమ్మూ, ధూళి చేరకుండా ఉంటుంది. కబోర్డ్స్ లోపల కూడా పాడవ్వకుండా ఉంటాయి.
చాలాసార్లు.. మనం ఇల్లు మారుతున్నప్పుడు.. గాజు వస్తువులను మార్చడం చాలా కష్టమైన పని. ఎందుకంటే.. ఎంత జాగ్రత్తగా తీసుకువెళ్దామన్నా కూడా పగిలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ న్యూస్ పేపర్లు చాలా బాగా ఉపయోగపడతాయి. మీ ఇంట్లో గాజు లేదా పింగాణీ వస్తువులు ఉంటే... వాటిని జాగ్రత్తగా న్యూస్ పేపర్ లో చుట్టి.. ఆ తర్వాత ఏదైనా బాక్సుల్లో పెట్టి తరలిస్తే.. పగలకుండా ఉంటాయి.