Psychology: సైకాలజీ ప్రకారం మనసు ఎక్కువగా ఎప్పుడు బాధపడుతుందో తెలుసా..?

Published : Jun 11, 2026, 06:44 PM IST

Psychology: మనిషి జీవితంలో సంతోషం ఎంత సహజమో, బాధ కూడా అంతే సహజం. కానీ కొన్ని సందర్భాల్లో మనసు ఎందుకు బాధపడుతుందో మనకే అర్థం కాదు. ఇలాంటి అనుభవం దాదాపు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. సైకాలజీ ప్రకారం మనసు ఎక్కువగా ఎప్పుడు బాధపడుతుందో ఇక్కడ చూద్దాం. 

PREV
16
మనసు ఎప్పుడు ఎక్కువగా బాధపడుతుంది?

మనిషి జీవితంలో బాధ అనేది సహజమైన భావోద్వేగం. అయితే ప్రతి బాధ ఒకే కారణంతో రాదు. కొన్నిసార్లు జరిగిన సంఘటనల వల్ల మనసు నొచ్చుకుంటే, మరికొన్నిసార్లు మన ఆలోచనలే మనల్ని బాధలోకి నెట్టేస్తాయి. సైకాలజీ నిపుణుల ప్రకారం మనసు ఎక్కువగా బాధపడేది కేవలం కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు.. మన అంచనాలు, సంబంధాలు, ఆత్మగౌరవం, ఒంటరితనం వంటి అంశాలు దెబ్బతిన్నప్పుడు కూడా. అందుకే బాధకు అసలు కారణాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

26
ఊహించింది జరగనప్పుడు

సైకాలజీ ప్రకారం మనం ఎక్కువగా బాధపడేది మనం ఊహించింది జరగనప్పుడు. ప్రతి వ్యక్తికీ తన జీవితంపై కొన్ని ఆశలు, అంచనాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్ రావాలని, ప్రేమించిన వ్యక్తి మనల్ని అర్థం చేసుకోవాలని, కుటుంబ సభ్యులు మనకు మద్ధతు ఇవ్వాలని ఆశిస్తాం. అయితే వాస్తవ పరిస్థితులు మన అంచనాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు మనసులో నిరాశ ఏర్పడుతుంది. ఈ నిరాశ క్రమంగా బాధగా మారుతుంది.

36
రిజెక్ట్ చేసినప్పుడు

మనిషి సహజంగా ఆమోదం కోరుకునే జీవి. మనల్ని ఎవరైనా తిరస్కరించినప్పుడు, పట్టించుకోనప్పుడు లేదా మన విలువను గుర్తించనప్పుడు మనసు తీవ్రంగా బాధపడుతుంది. ముఖ్యంగా ప్రేమ, స్నేహం లేదా కుటుంబ సంబంధాల్లో నిర్లక్ష్యం.. మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అలాగే ఒంటరితనం కూడా మనసును తీవ్రంగా బాధపెడుతుంది. నిజంగా మన భావాలను పంచుకునే వ్యక్తి లేకపోతే మనసు వెలితిగా అనిపిస్తుంది. 

46
గతాన్ని పదే పదే గుర్తు చేసుకోవడం

చాలామంది గతంలో జరిగిన తప్పులు, కోల్పోయిన అవకాశాలు లేదా బాధాకరమైన సంఘటనలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. దీన్ని సైకాలజీలో "రూమినేషన్" అని పిలుస్తారు. ఈ అలవాటు వల్ల సమస్యకు పరిష్కారం దొరకదు, కానీ మనసులో బాధ మాత్రం మరింత పెరుగుతుంది. 

56
ఇతరులతో తమ జీవితాన్ని పోల్చుకోవడం

సోషల్ మీడియాలో ఇతరుల విజయాలు, ఆనందాలు, లగ్జరీ లైఫ్ స్టైల్ ని చూస్తూ చాలామంది తమ జీవితాన్ని తక్కువగా అంచనా వేస్తారు. కానీ మనం చూసేది వారి జీవితంలోని మంచి క్షణాలు మాత్రమే. వాటిని మన జీవితంలోని కష్టాలతో పోల్చడం సరైన పద్ధతి కాదు. ఈ పోలికలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి అనవసరమైన బాధను కలిగిస్తాయి.

66
ఇవి పాటిస్తే..

నిపుణుల ప్రకారం మనసులోని బాధను పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, దాన్ని ఆరోగ్యకరంగా ఎదుర్కోవడం మాత్రం నేర్చుకోవచ్చు. మన భావాలను అణచిపెట్టకుండా నమ్మకమైన వ్యక్తులతో పంచుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరిపడా నిద్రపోవడం, ధ్యానం లేదా మైండ్‌ఫుల్‌నెస్ సాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories