Halwa Recipe: కార్న్‌ఫ్లోర్‌తో 10 నిమిషాల్లో ముంబై కరాచీ హల్వా రెసిపీ.. నోట్లో వేస్తే కరిగిపోతుంది

Published : Nov 16, 2026, 12:15 PM IST

ఎక్కువ కష్టపడకుండా కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే హల్వా రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఇది నోట్లో వేసుకుంటే చాలు కరిగిపోతుంది. ఈ ముంబై కరాచీ హల్వాను ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ దీని ప్రాసెస్ ఇచ్చాము.

PREV
13
ముంబై కరాచీ హల్వా రెసిపీ ఎలా?

హల్వా పేరు చెబితేనే నోట్లో నీళ్లూరుతాయి. ఏ పండుగలకైనా ఇంట్లో స్వీట్ తప్పని సరి ఇక్కడ మేము కేవలం పది నిమిషాల్లోనే ముంబై కరాచీ హల్వా ఎలా చేయాలో చెప్పాము. తక్కువ సమయంలో ఇది తయారైపోతుంది. కార్న్‌ఫ్లోర్, పంచదార, నెయ్యితో చేసే ఈ స్వీట్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.

23
కరాచీ హల్వాకు కావాల్సిన పదార్థాలు

కార్న్‌ఫ్లోర్ (Cornflour): 1 కప్పు

పంచదార: 1.5 కప్పు

నీళ్లు: 4 కప్పులు (పిండి కలపడానికి 2 కప్పులు + పాకం కోసం 2 కప్పులు)

యాలకుల పొడి: 1/4 టీస్పూన్

ఆరెంజ్ ఫుడ్ కలర్ (Orange Food Colour): 2 చుక్కలు

నెయ్యి: 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు

డ్రై ఫ్రూట్స్: తరిగిన కిస్మిస్ & నట్స్

33
కరాచీ హల్వా రెసిపీ
  1. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు కార్న్‌ఫ్లోర్‌ వేసి 2 కప్పుల నీళ్లు వేయాలి. ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  2. ఒక కళాయిని స్టవ్ మీద పెట్టి 1.5 కప్పుల పంచదార, 2 కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. పంచదార కరిగి మరిగిన తర్వాత, మంటను సిమ్‌లో పెట్టండి.
  3. ఇప్పుడు ముందుగా కలిపిన కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని పంచదార పాకంలో కొద్దికొద్దిగా వేస్తూ కలుపుతూనే ఉండాలి.
  4. మిశ్రమం గట్టిపడి అద్దంలా మెరుస్తున్నప్పుడు, యాలకుల పొడి, ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి బాగా కలపాలి.
  5. ఆ తర్వాత నెయ్యి కొంచెం కొంచెంగా వేస్తూ హల్వా గిన్నెకు అంటుకోకుండా దగ్గరపడే వరకు కలపాలి.
  6. చివర్లో ముందుగా తరిగి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ వేసి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.
  7. ఒక ప్లేటుకు నెయ్యి రాసి హల్వాను సమానంగా పోసుకోవాలి. బాగా చల్లారాక, మీకు నచ్చిన షేప్‌లో ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేయొచ్చు.
  8. అంతే, నోట్లో కరిగిపోయే ముంబై కరాచీ హల్వా రెడీ!
Read more Photos on
click me!

Recommended Stories