ఎలాంటి ఆహారం తీసుకోవాలి
పల్మనరీ ఎడెమా సమస్య ఉంటే మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మీ రోజు వారి ఆహారంలో పోషకాలు ఉండేట్టు చూసుకోవాలి. ఆకు పచ్చకూరగాయలు, తాజా పండ్లు, చిక్కుళ్లు, చేపలు, చికెన్, గుడ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే నిమ్మకాయ, నల్ల మిరియాలు, వెల్లుల్లి వంటి సుగంధ ద్రవ్యాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది.