పొట్టి జుట్టును పొడుగ్గా చేసే చిట్కాలు.. మీకోసం..

First Published Oct 3, 2022, 1:59 PM IST

జుట్టు నల్లగా, పొడుగ్గా, అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ఇలాంటి జుట్టు నూటిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే ఆ నూటిలో ఒకరుగా మీరు కూడా ఉంటారు. 
 

అందమైన, పొడవైన జుట్టు ఉండాలని ప్రతి అమ్మాయికి  ఉంటుంది. కానీ వాతావరణ కాలుష్యం, మెడిసిన్స్, జుట్టును శుభ్రంగా ఉంచుకోకపోవడం, రసాయనాలు ఎక్కువగా ఉండే ఉత్పత్తులను వాడటం,మానసిక ఒత్తిడి వంటి కారణాల వల్ల జుట్టు ఊడిపోవడం, డ్రైగా మారడం, జీవం లేనట్టుగా కనిపించడం వంటి జుట్టు సమస్యలు వస్తాయి. ఇక కొందరి జుట్టుతై చిన్నవయసులోనే తెల్లగా మారిపోతుంది. ఈ జుట్టు సమస్యలన్నీ పోవాలంటే కొన్ని చిట్కాలను తప్పక పాటించాల్సిందే. అప్పుడే మీ జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది. 
 


జుట్టు పెరగకపోవడానికి కారణాలు 

హార్మోన్ల హెచ్చు తగ్గులు

మీరు తినే ఆహారంలో పోషకాలు లేకపోవడం

స్ట్రెస్ కు గురవడం

కెమికల్స్ ఉన్న షాంపూను యూజ్ చేయడం 

కెమికల్స్ హెయిర్ కేర్ ప్రొడక్ట్ లను ఉపయోగించడం

కొన్ని మందులు కూడా జుట్టు పెరుగుదలను అడ్డుకుంటాయి  

కంటినిండా నిద్రలేకపోవడం

జన్యుపరమైన కారణాల వల్ల జుట్టు రాలడం

జుట్టు పెరిగేందుకు చేయాల్సిన పనులు

క్రమం తప్పకుండా నూనెతో జుట్టును మసాజ్ చేయడం వల్ల జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది. మీ మాడు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మీ జుట్టు కూడా బాగా పెరుగుతుంది. మాడు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ తలకు నూనె రాసి చిన్నగా మసాజ్ చేయాలి. ప్రతిరోజూ నూనెను మసాజ్ చేయడం వల్ల మాడుకు రక్త ప్రవాహం పెరుగుతుంది. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. నెత్తికి పోషణ అందుతుంది. అలాగే ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. మసాజ్ కోసం ఆవనూనె, బాదం నూనె, పీల్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించండి. ఏదైనా ఒక నూనెతో నెత్తికి వారానికి రెండుసార్లు మసాజ్ చేయాలి.
 

మంచి నిద్ర

మన ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. శరీర ఆరోగ్యానికే కాదు జుట్టు ఆరోగ్యానికి కూడా నిద్ర చాలా ముఖ్యం. ఆరోగ్యవంతమైన వ్యక్తికి 6 గంటల నిద్ర చాలా ముఖ్యం. ఈ నిద్రతోనే మీ శరీరం ఫోలికల్స్, ఇతర కణజాలాలను రిపేర్ చేస్తుంది. ఇది జుట్టు పెరుగుదలకు దారితీస్తుంది.
 

తలకు షాంపూ చేయండి

దుమ్ము, దూళి కూడా జుట్టు పెరుగుదలను అడ్డుకుంటాయి. ఎందుకంటే వీటివల్ల మాడు మురికిగా మారుతుంది. ఇవి జుట్టును దెబ్బతీస్తాయి. దుమ్ము, దూళి వల్ల జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. చుండ్రు కూడా వస్తుంది. తక్కువ ఘాడత ఉన్న షాంపూతో మీ జుట్టుకు క్లీన్ చేసుకోవాలి. షాంపూ అప్లై చేసిన తర్వాత నెత్తిని మసాజ్ చేయండి. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది. అలాగే ఆక్సిజన్ మీ జుట్టు బేస్ కు బాగా వెళుతుంది. అయితే జుట్టుకు షాంపూను వారానికి రెండు సార్లు మాత్రమే పెట్టాలన్న సంగతి మర్చిపోకండి. 
 

మన జుట్టు ప్రోటీన్ తో తయారవుతుంది. కాబట్టి మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తినే ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ను ఆహారంలో ఉండేట్టు చూసుకోండి. ఇందుకోసం చేపలు, గుడ్లు, గింజలు, జనపనార గింజలు, పాల ఉత్పత్తులు తీసుకోండి. 

 నిద్రపోయే ముందు నెత్తిని దువ్వుకోవడం వల్ల వెంట్రుకల మొదల్లకు రక్త ప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల మీ జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది. ఇందుకోసం వెడల్పాటి దంతాలున్న చెక్క దువ్వెనను ఉపయోగించండి. 
 

click me!