వేడి వేడి అన్నంలో నెయ్యిని వేసుకుని తినే అలవాటు చాలా మందికే ఉంటుంది. నెయ్యి రుచిగానే కాదు.. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నెయ్యిలో ఎన్నో రకాల విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వు, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎన్నో అనారోగ్య సమస్యలను పోగొడుతాయి. నెయ్యి తినడం వల్ల శరీరానికి బలం రావడమే కాదు.. జీర్ణ వ్యవస్థ కూడా మెరుగ్గా పనిచేస్తుంది. అంతేకాదు ఇది చర్మ సమస్యలను కూడా పోగొడుతుంది.