Career Growth: మీరు అనుకున్నది సాధించాలంటే కచ్చితంగా ఈ లక్షణం మీకుండాలి

Published : Jun 11, 2025, 10:07 PM IST

పుట్టుకతోనే కొన్ని లక్షణాలు వస్తాయని, దీంతో లైఫ్‌లో ఈజీగా సక్సెస్ కూడా వచ్చేస్తుందని చాలా మంది అనుకుంటారు. కాని అది తప్పని మానసిక నిపుణులు చెబుతున్నారు. టాలెంట్ కన్నా ఈ ఒక్క లక్షణం మీకుంటే ఏ విషయంలోనే విజయం సాధించవచ్చని అంటున్నారు. అదేంటో చూద్దామా? 

PREV
15
విజయానికి కారణం ప్రతిభా? మనస్తత్వమా?

ప్రతిభ ఉంటే విజయం వరిస్తుందని అనుకుంటారు. కాని ప్రతిభ ఒక్కటే సరిపోదని, సరైన మనస్తత్వం కూడా తోడైతేనే విజయం సాధ్యమని మానసిక నిపుణులు చెబుతున్నారు. 

మనస్తత్వంలో కూడా రెండు రకాలు ఉన్నాయి. స్థిర మనస్తత్వం (Fixed Mindset), వృద్ధి మనస్తత్వం (Growth Mindset). ఎలాంటి మైండ్ సెట్ ఉంటే అనుకున్న లక్ష్యం సాధించగలరో నిపుణులు చెప్పిన వివరణ ఇప్పుడు తెలుసుకుందాం. 

25
ఫిక్స్‌డ్ మైండ్ సెట్ vs. గ్రోత్ మైండ్ సెట్

ఫిక్స్‌డ్ మైండ్ సెట్ కలిగిన వారు తమ ప్రతిభ, తెలివితేటలు, సామర్థ్యాలు జన్మతోనే వచ్చాయని నమ్ముతారు. అలాంటి వారు సవాళ్లను భయపడతారు. ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్న పనులను చేయడానికి వెనకడుగేస్తారు.

గ్రోత్ మైండ్ సెట్ కలిగిన వారు కృషి, అభ్యాసం ద్వారా టాలెంట్ పెంచుకోవచ్చని నమ్ముతారు. వారు సమస్యలను నేర్చుకునే అవకాశాలుగా చూస్తారు. సవాళ్లను స్వీకరిస్తారు. విఫలమైనా ప్రయత్నించడం ఆపరు. ఇది వారికి కెరీర్‌లో వేగంగా ఎదగడానికి దోహదపడుతుంది.

35
కెరీర్ విజయంలో ఆత్మవిశ్వాసం

ఆత్మవిశ్వాసం పుట్టుకతో వచ్చే లక్షణం కాదు. దాన్ని ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోవాలి. ఆత్మవిశ్వాసం పెంపొందాలంటే మీరు సాధించే చిన్న విజయాలను కూడా సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. మీ పురోగతిని గుర్తించుకోవడం, భయం ఉన్నప్పటికీ ముందుకు సాగడం అలవాటు చేసుకుంటే ఆత్మవిశ్వాసం ఆటోమెటిక్ గా పెరుగుతుంది. “నేను ఎందుకు విఫలమయ్యాను?” అనే బదులుగా “దీని నుండి నేను ఏమి నేర్చుకోవచ్చు?” అని ప్రశ్నించగలగడం గ్రోత్ మైండ్ సెట్ కి సంకేతం.

45
వైఫల్యాన్ని ఫీడ్‌బ్యాక్‌గా తీసుకోండి

వైఫల్యం అనేది ముగింపు కాదు. ఇది విజయానికి ఒక మెట్టు. వైఫల్యాలను ఓటమిగా చూడటానికి బదులుగా, వాటిని ఫీడ్‌బ్యాక్‌గా మార్చండి.

విజువలైజేషన్(దృశ్యమానం) అనే ప్రక్రియ ద్వారా మీ పనిలో మీరు విజయం సాధించినట్టు ఊహించుకోవచ్చు. అంటే ఇంటర్వ్యూలు, ప్రాజెక్టుల వంటి సందర్భాల్లో సక్సెస్ అయినట్లు ఊహిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. దీనికి విజువలైజేషన్ ప్రేరణగా ఉపయోగపడుతుంది. 

55
నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి

విజయం అంటే అదేమీ గమ్యస్థానం కాదు. కేవలం ఒక మలుపు మాత్రమే. మీరు అనుకున్న లక్ష్యం నెరవేరిన తర్వాత ఇంకో లక్ష్యం మొదలవుతుంది. అందువల్ల విజేతలు ఎప్పుడూ తమకు కావాల్సిన విషయాలను నేర్చుకుంటూ ఉంటారు. తాజా కెరీర్ అవకాశాలను తెలుసుకుంటారు, మెంటార్లు, నెట్‌వర్కింగ్ అవకాశాలను వెతుక్కుంటారు. సేఫ్ జోన్‌ను వదిలి సవాళ్లను స్వీకరిస్తారు.

మొత్తానికి ప్రతిభ ఒక్కటే కాదు. మనస్తత్వం, అభ్యాసం, ఆత్మవిశ్వాసం, వైఫల్యాన్ని అర్థం చేసుకునే ధోరణి కూడా కెరీర్‌లో విజయం సాధించేందుకు కీలకమైన పాత్ర పోషిస్తాయి. మీరు ఎదగాలనుకుంటే మొదట మీ మనస్తత్వాన్ని సక్రమైన మార్గంలో పెంచేందుకు ప్రయత్నం చేయాలి.

Read more Photos on
click me!

Recommended Stories