Cancer Risk: బాబోయ్.. ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తే క్యాన్సర్ వస్తుందా?

Published : May 22, 2025, 10:19 PM IST

మనలో చాలా మంది కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని పనిచేస్తుంటాం కదా.. ఎక్కువసేపు కూర్చొని ఉంటే ఆరోగ్యానికి హానికరం అని మీకు తెలుసా? ఒక్కోసారి క్యాన్సర్ కూడా రావచ్చని డాక్టర్లు చెబుతున్నారు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
రిస్క్ లో ఉద్యోగులు

ఉద్యోగాలు చేసే క్రమంలో చాలా మంది గంటల తరబడి కుర్చీల్లోనే కుర్చుంటారు. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయిస్ అయితే 12, 14 గంటలు కూడా పనిచేస్తుంటారు. ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని, ముఖ్యంగా క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు కూడా సోకే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 

25
క్యాన్సర్ వచ్చినట్లు ఆధారాలున్నాయి

ఎక్కువసేపు కూర్చుంటే పెద్దప్రేగు, ఎండోమెట్రియల్, ఊపిరితిత్తుల క్యాన్సర్ల ప్రమాదం పెరుగుతుందని, దీనికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయని క్యాన్సర్ నివారణ పరిశోధకులు చెబుతున్నారు. ఇది ఊబకాయం, డయాబెటిస్, గుండె జబ్బులు, అకాల మరణం వంటి ప్రమాదాలను కూడా పెంచుతుంది. కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చుని పనిచేయకుండా మధ్యలో కాస్త విరామం తీసుకోవడం మీ ఆరోగ్యానికి మంచిది.

35
ఈ అలవాట్లు చేసుకుంటే మేలు

లేచి గంటకోసారి నడవండి. ఫోన్‌లో మాట్లాడేటప్పుడు లేచి నిలబడటం లేదా టీవీ చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు నడవడం అలవాటు చేసుకోండి. 

మీరు టీవీ, వీడియో గేమ్‌లు, ఇతర స్క్రీన్ టైమ్‌ని తగ్గిస్తే ఇతర పనులకు ఎక్కువ సమయం దొరుకుతుంది. రోజుకు ఒక గంట కూర్చునే సమయాన్ని తగ్గించడం వల్ల అకాల మరణ ప్రమాదం 20% తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

45
వ్యాయామం చేయాలి

క్యాన్సర్ రిస్క్ తగ్గించుకోవాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

55
డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

రోజుకు 10 గంటలకు పైగా కూర్చుంటే గుండె జబ్బులు, దానికి సంబంధించిన సమస్యల ప్రమాదం పెరుగుతుందని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీలో ప్రచురితమైన ఒక అధ్యయనం తెలిపింది. 

ఒకే చోట ఎక్కువసేపు కూర్చునే పరిస్థితి ఏర్పడితే మధ్యలో కొంత విరామం తీసుకుని నడవడం లేదా మెట్లు ఎక్కి దిగడం చేయాలి. ఇలా చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories