35 ఏండ్ల తర్వాత గర్భం దాల్చితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?

First Published | Dec 22, 2022, 12:55 PM IST

తల్లి ఆరోగ్య పరిస్థితి, ఇంటి ఆర్థిక స్థితి, సమయం, వయస్సు వంటివెన్నో గర్భధారణను ప్రభావితం చేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అసలు గర్భం దాల్చిడానికి ఏది సరైన వయసు..? ఒకవేళ 35 ఏండ్ల తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

pregnancy

వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ పిల్లలు ఎంత తొందరగా పుడితే అంత మంచిదని భావిస్తారు. నిజానికి ఈ రోజుల్లో చాలా మంది 30 ఏండ్లు నిండిన తర్వాతే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయినా అప్పుడే పిల్లలు వద్దని రెండు మూడేండ్లు వాయిదా వేసుకుంటున్నారు. నిజానికి పిల్లల్ని సరైన వయసులో కంటేనే మంచిది. లేదంటే పిల్లలకు, తల్లులకు లేనిపోని అనారోగ్య సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. 

జీవనశైలిలో మార్పులు, ఇతర కారకాల వల్ల గత దశాబ్దం నుంచి మన దేశంలో సంతానోత్పత్తి రేటు ప్రతి ఏడాది సుమారుగా 1 శాతం తగ్గుతోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే 35 ఏండ్ల తర్వాత సంతానం కలిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వయసులోని ఆడవారు గర్భందాల్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఒకవేళ గర్భం దాల్చిన ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అవేంటంటే.. 

pregnancy

గర్భధారణ మధుమేహం (జిడిఎమ్)

ప్రెగ్నెన్సీ సమయంలో శరీరం తగినంత మొత్తంలో ఇన్సులిన్  ను ఉత్పత్తి చేయలేనప్పుడు.. గర్భధారణ మధుమేహం వస్తుంది. వయసుతో పాటు ఊబకాయం, నిశ్చల జీవనశైలి, కుటుంబంలో మధుమేహం చరిత్ర వంటి అంశాలు డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. గర్భాధారణ సమయంలో మధుమేహం రావడం వల్ల పిల్లలు మరీ ఎక్కువ బరువుతో పుట్టే అవకాశం ఉంటుంది.
 


అధిక రక్తపోటు

సాధారణంగా రక్తపోటు వృద్ధులలోనే ఎక్కువగా కనిపిస్తుంది. మహిళలు వృద్ధాప్యంలో గర్భవతి అయినప్పుడు.. వారికి ఇంతకు ముందు రక్తపోటు లేనప్పటికీ  అధిక రక్తపోటు బారిన పడే అవకాశం ఉంది. ఈ అధిక రక్తపోటు పిండం పెరుగుదలను ప్రభావితం చేస్తుంది.
 

పోస్ట్-డేటెడ్ గర్భం

వయస్సు పెరిగేకొద్దీ  postdatism ప్రమాదం (42 వారాలకు మించి) పెరుగుతుంది. పోస్ట్ డాటిజంలో మహిళలకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనిలో బిడ్డ సరైన సమయానికి బయటకి రాకపోవచ్చు. సిజేరియన్ చేయాల్సి వస్తుంది. 

పెరిగిన సి-సెక్షన్ డెలివరీ

సి సెక్షన్ డెలివరీనే సిజేరియన్ డెలివరీ అని కూడా పిలుస్తారు. రక్తపోటు, జిడిఎం, మావి ప్రీవియా, పోస్ట్డాటిజం వంటి ప్రమాదకాలను తొలగించడానికి చాలా మందికి సెజేరియన్ డెలివరీలే చేస్తున్నారు. 
 

మావి ప్రేవియా

వయస్సు పెరిగేకొద్దీ..మావి గర్భాశయానికి దగ్గరగా ఉన్న చోట ప్లాసెంటా ప్రేవియా ప్రమాదం పెరుగుతుంది. అంటే మావి పూర్తిగా లేదా కొంత భాగం గర్భాశయాన్ని కప్పి ఉంచుతుంది. దీంతో ఇది తెరచుకోలేదు. అందుకే ఇలాంటి సందర్భంలో సి-సెక్షన్ డెలివరీ చేస్తారు.  ప్లాసెంటా అనేది ప్రెగ్నెన్సీ టైంలో  గర్భాశయం లోపల అభివృద్ధి చెందుతుంది. ఇది శిశువుకు ఆక్సిజన్, పోషణను అందించడానికి సహాయపడుతుంది. అలాగే వ్యర్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. 
 

বাংলা-গর্ভবর্তী

గర్భస్రావం అయ్యే అవకాశాలు

 వయస్సు పెరిగేకొద్దీ గర్భస్రావం అయ్యే ప్రమాదం బాగా పెరుగుతుంది. అయితే చాలాసార్లు ఈ గర్భస్రావం క్రోమోజోమల్ అసాధారణతల వల్ల జరుగుతుంది.
 

pregnancy

ఏదేమైనా పిల్లలను కనడానికి ప్లాన్ చేసుకోవడానికి ముందు సరైన నిర్ణయం తీసుకోవాలి. తల్లి వైద్య ఆరోగ్య పరిస్థితులు, ఇంటి ఆర్థిక పరిస్థితులు, సమయం,  వయస్సుతో పాటుగా మరెన్నో కారకాలు గర్భధారణను ప్రభావితం చేస్తాయి. ఇలాంటి నిర్ణయాలను కుటుంబ సభ్యుల ఒత్తిడితో తీసుకోకూడదు. ప్రెగ్నెన్సీకి ముందు వారి ఆరోగ్య పరిస్థితి, ఇతర కారకాలను అర్థం చేసుకోవడానికి డాక్టర్ ను సంప్రదించాలి. సరైన ఆహారం, వ్యాయామ అలవాట్లు, వ్యాధుల ముందస్తు నిర్ధారణ, మెరుగైన జీవనశైలి గర్భధారణకు చాలా అవసరం. ముఖ్యంగా వయసు. సరైన వయసులో గర్భం దాల్చితే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు.  

Latest Videos

click me!