అతిగా తింటున్నారా? అజీర్థి, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు రాకూడదంటే ఇలా చేయండి..

First Published Dec 22, 2022, 11:57 AM IST

కొంతమంది మోతాదుకు మించి తింటుంటారు. తినడంలో తప్పు లేదు. కానీ అతిగా తింటేనే లేని పోని తిప్పలు వస్తాయి. విపరీతంగా బరువు పెరిగిపోతారు. ముఖ్యంగా జీర్ణక్రియ ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. 
 

over eating

మన శరీరానికి ఆహారం అవసరం కాదు. అత్యవసరం. ఎందుకంటే ఈ ఫుడ్ వల్లే మనం బతుకుతున్నాం.. అలాగని ఏవి పడితే అవి తినడం, ఎంత పడితే అంత తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. పండుగల సందర్భంగా చాలా మంది వాళ్లకు తెలియకుండానే అతిగా తినేస్తుంటారు. అతిగా తినడం వల్ల ఒళ్లు పెరుగుతుంది. అజీర్థి, మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ వంటి ఎన్నో సమస్యలు వస్తుంటాయి. దీనికంతటికీ కారణం జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడమే. ఎక్కువగా తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ఎక్కువ పనిబారం పడటం వల్ల ఇలా అవుతుంది. ఇలాంటి వాళ్లకు కొన్ని చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. వీటిని పాటించడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్థి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం రాదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

warm water

గోరువెచ్చని నీటిని తాగాలి

మీరు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా తింటూనే ఉంటే మాత్రం గోరు వెచ్చని నీటిని తప్పకుండా తాగండి. ఇవే మీకు మంచి మెడిసిన్ లా పనిచేస్తాయి. ఎక్కువ మొత్తంలో తిన్న వెంటనే  గోరు వెచ్చని నీటిని తాగండని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. ఈ గోరు వెచ్చని నీరే మీ జీర్ణక్రియ ప్రక్రియకు సహాయపడుతుంది. ఎలా అంటే ఇది మీ శరీరంలో ఉన్న విషపదార్థాలను సమర్థవంతంగా బయటకు పంపేందుకు సహాయపడుతుంది. ఈ నీళ్లు మీ కడుపు నిండిన భావనను కలిగిస్తాయి కూడా. దీంతో మీరు ఆ వెంటనే తినలేరు. 
 

హెర్బల్ టీ, మసాలా దినుసులు

భారీ భోజనం చేసిన తర్వాత జీర్ణక్రియ పనివేగాన్ని పెంచడానికి కొన్ని రకాల మూలికలు, సుగంధ ద్రవ్యాలు సహాయపడతాయి. వాము, జీరా వంటి మసాలా దినుసులు జీర్ణక్రియకు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం కోసం వీటిని ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించి భోజనం చేసిన తర్వాత తాగండి. గ్రీన్ టీ, చామంతి టీ, అల్లం టీ వంటి మూలికా టీలు కూడా జీర్ణక్రియను పెంచడానికి సహాయపడతాయి.

chicken soup

తదుపరి భోజనాన్ని తేలికగా ఉంచండి

అతిగా తినడం వల్ల మీ జీర్ణవ్యవస్థ ఎక్కువగా పనిచేస్తుంది. దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యలు రాకూడదంటే తదుపరి భోజనాన్ని తేలికగా ఉంచడానికి ప్రయత్నించండి. ఇక మరుసుటి రోజు మీ జీర్ణవ్యవస్థకు రెస్ట్ ఇవ్వండి. అతిగా తిన్న తర్వాత మీ తదుపరి భోజనంలో టోస్ట్ తో సూప్ తీసుకోవచ్చు. లేదా కొన్ని పండ్లు, కూరగాయలు తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియను పెంచడానికి, గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి విందు కోసం ఉడకబెట్టిన కూరగాయల సూప్ లేదా చికెనన్ సూప్ ను తీసుకోవచ్చు. 
 

fiber

 ఫైబర్ 

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను మీ ప్రేగు కదలికకు తోడ్పడతాయి. అలాగే ఆరోగ్యకరమైన జీర్ణక్రియను నిర్వహించడానికి సహాయపడుతుంది. అతిగా తిన్న తర్వాత.. మీరు తినే ఆహారంలో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ను చేర్చితే జీర్ణ సమస్యలకు దూరంగా ఉంటారు. ఇందకోసం పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినండి. 
 

Image Courtesy: TobyPexels

నడవండి, నిటారుగా కూర్చోండి

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అతిగా తిన్న తర్వాత మీ జీర్ణక్రియను మెరుగుపరచడానికి 15 నుంచి 20 నిమిషాల పాటు నడవండి. అయితే మీరు భారీగా తిన్న తర్వాత భారీ వ్యాయామాలు అసలే చేయకూడదు. కానీ తేలికపాటి నడక ఖచ్చితంగా ఉండాలి. అలాగే అతిగా తిన్న వెంటనే మీరు పడుకోకూడదు. ఎందుకంటే ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. అజీర్థి సమస్యను పెంచుతుంది. 
 

పులియబెట్టిన ఆహారాలు

గట్ ను ఆరోగ్యంగా ఉంచడానికి పులియబెట్టిన  ఆహారాలు ఎంతో మేలు చేస్తాయి. సాధారణ పెరుగు లేదా కంజీ వంటి ఇతర పులియబెట్టిన ఆహారాలను తీసుకోవచ్చు. భారీ భోజనం తర్వాత వీటిని ఖచ్చితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. మీరు భారీగా తిన్న తర్వాత  తర్వాతి భోజనంలో వీటిని ఖచ్చితంగా తీసుకోండి. కిమ్చి సలాడ్ వంటి పులియబెట్టిన కూరగాయలను మీ ఆహారంలో చేర్చండి. కడుపు ఉబ్బరం రాకూడదంటే పాలను తాగకండి. 

click me!