కరోనా తర్వాత ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే వీటికి దూరంగా ఉండాల్సిందే..!

First Published Sep 8, 2022, 10:25 AM IST

కరోనా  తగ్గిన తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నడకలో ఇబ్బంది, అలసట వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు దీర్ఘకాలిక దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా వస్తాయి. 
 

కరోనాకు ముగింపు ఇప్పట్లో లేదనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికి కూడా ఈ వైరస్ దారుణంగా వ్యాపిస్తూనే ఉంది. ఈ వైరస్ జన్యుపరంగా మార్పు చెంది కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. వీటి జనాలు బారిన పడుతూనే ఉన్నారు. ఈ వైరస్ ఒకే వ్యక్తికి రెండు మూడు సార్లు సోకిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే  ఈ వ్యాధి కొందరికి పూర్తిగా తగ్గినా.. మరికొందరికి మాత్రం ఈ వ్యాధి నుంచి బయటపడినా.. దీనివల్ల ఎన్నో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను ఫేస్ చేస్తున్నారు. కోవిడ్ తర్వాత దీర్ఘకాలికంగా కనిపించే అనారోగ్య సమస్యల్లో ఊపిరితిత్తుల వ్యాధి ఒకటి. దీనివల్ల ఊపిరితిత్తులు ఎక్కువగా ప్రభావితమవుతాయి. 

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నడకలో ఇబ్బంది, అలసటి వంటి సమస్యలను కోవిడ్ తర్వాత ఎదుర్కొంటున్న వారు చాలా మందే న్నారు. వీటితో పాటుగా దీర్ఘకాలిక జలుబు, దగ్గు వంటి సమస్యలను కూడా ఎదుర్కొంటున్నవారున్నారు.  ఇవన్నీ ఊపిరితిత్తులపై చెడు ప్రభావాన్ని చూపడం వల్లే వస్తాయి. కోవిడ్ తర్వాత ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం పదండి. 

smoking

ధూమపానం

స్మోకింగ్ చేసే హాబిట్ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. దీన్ని వదిలించుకోవడం అంత అంత తేలిక కాదు. కానీ ప్రయత్నిస్తే సులువుగా ఈ అలవాటు నుంచి బయటపడొచ్చు. ఎందుకంటే ధూమపానం ఊపిరితిత్తుల్లోని రోగనిరోధక కణాలను ప్రమాదంలో పడేస్తుంది. అందులోనూ కోవిడ్ ప్రభావం ఉన్నప్పుడు దీని పర్యవసానాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ అలవాటును వీలైనంత  తొందరగా వదిలించుకోండి.
 

ఆల్కహాల్

ఆల్కహాల్ కూడా శరీరానికి ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా కోవిడ్ సోకిన వారికి ఇది ఇంకా ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే ఇది కోవిడ్ సృష్టించిన ఆరోగ్య సమస్యలను మరింత పెంచుతుంది. ఆల్కహాల్ ఒక్క ఊపిరితిత్తులనే కాదు మొత్తం ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

lungs


ఆరోగ్యకరమైన ఆహారాలు

కోవిడ్  తగ్గిన తర్వాత రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా మారుతుంది. అందుకే రోగ నిరోధక శక్తిని పంచే ఆహారాలను పుష్కలంగా తినండి. ఇవి ఊపిరితిత్తులను కూడా కాపాడుతాయి. ఇందుకోసం కూరగాయలు, పండ్లు,  చిక్కుళ్ళు, గింజలు, తృణధాన్యాలు, రసాలను మీ రోజు వారి ఆహారంలో చేర్చండి. అందులో  ఇంట్లో వండిన ఆహారాలనే ఎక్కువగా తినండి. బయటి ఫుడ్ మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మీరు తినే ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు, ముఖ్యమైన ఖనిజాలు ఉండేట్టు చూసుకోండి. వీటితో పాటుగా మీ శరీరానికి అవసరమయ్యే నీటిని తాగుతూ ఉండండి. 
 

exercise


వ్యాయామం

కోవిడ్ తర్వాత ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుకుంటాయి. అందుకే ఇలాంటి వారు రోజూ వ్యాయామం చేయాలి. వ్యాయామం ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో  ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ వారి వయస్సు, ఆరోగ్య స్థితిని బట్టి వ్యాయామం చేయాలి. దీని కోసం నిపుణుల సలహా తీసుకోండి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కోవిడ్ తర్వాత కఠినమైన వ్యాయామాలను చేయకండి. నడక, ఈత, రన్నింగ్ మొదలైన వ్యాయామాలు మీకు ఉపయోగపడతాయి. 
 

click me!