ఎలాంటి జబ్బులు లేకుండా ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టిప్స్ ను ఫాలో అవ్వండి..

First Published Sep 6, 2022, 4:02 PM IST

ప్రస్తుత కాలంలో  ప్రాణాంతక జబ్బులు కూడా సర్వ సాధారణ సమస్యలుగా మారిపోయాయి. జబ్బులు లేని వ్యక్తులుగా మారాలంటే మాత్రం ఈ టిప్స్ ను ఫాలో అవ్వాల్సిందే.. 
 

healthy food

గజిబిజీ లైఫ్ కారణంగా ప్రాణాంతక గుండెపోటుతో సహా ఎన్నో రోగాలు సర్వసాధారణ సమస్యలుగా మారిపోయాయి. ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యం కోసం కాస్త టైం కేటాయిస్తే.. మీరు ఎలాంటి రోగాలు లేకుండా నిండు నూరేళ్లు సంతోషంగా బతకొచ్చు. నేషనల్ న్యూట్రిషన్ వీక్ లో భాగంగా ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మనం ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటామో తెలుసుకుందాం పదండి. 

ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్

మనం తినే బ్రేక్ ఫాస్ట్ ఆరోగ్యకరమైందిగా ఉండాలి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉండేట్టు చూసుకోండి. ఎందుకంటే ఈ పోషకాలతోనే మీరు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. అయితే కొంతమంది టైం లేకో.. లేకపోతే బరువు తగ్గాలనో కానీ బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తుంటారు. ఇది పెద్ద తప్పు తెలుసా..? ఎందుకంటే బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తేనే మీరు మరింత బరువు పెరిగిపోయే ప్రమాదం ఉంది.  అంతేకాదు ఇది ఊబకాయం, గుండె జబ్బులు,, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు వంటి రోగాలకు దారితీస్తుంది. 
 

పండ్లు, కూరగాయలు

పండ్లు, కూరగాయల్లో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి.  వీటిలో ఉండే ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువును నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. అంతేకాదు ఇవి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయి. 
 

ఆరోగ్యకరమైన స్నాక్స్ 

కొన్ని రకాల స్నాక్స్ కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందుకోసం మీరు కిరాణా షాపింగ్ చేసేటప్పుడు మిల్లెట్ పఫ్స్, ప్రోటీన్ బార్లు, మఖానా వంటివి తీసుకోండి. ఉప్పు, చక్కెరను ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ లను తినడం మానేయండి.
 

కెఫిన్ ను తీసుకోవడం తగ్గించాలి

కెఫిన్ అప్పటిమందం కాస్త ఎనర్జీనిచ్చినా.. ఇది మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అందుకే టీ, కాఫీ లకు బదులుగా కొబ్బరి నీరు, నిమ్మరసం, పాలు, శీతల పానీయాలను, స్మూతీలను తీసుకోండి. ఇవి మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. 
 

శారీరక శ్రమ

శారీరక శ్రమతోనే జీవక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. శారీరక శ్రమతోనే నిద్ర చక్రం మెరుగ్గా ఉంటుంది. రక్త ప్రవాహం కూడా పెరుగుతుంది. అందుకే ప్రతిరోజూ ఉదయం 15 నిమిసాలు బాడీ మొత్తం కదిలేలా నడవండి.

vitamin d

విటమిన్ డి, విటమిన్ బి12 

విటమిన్ డి, విటమిన్ బి 12 మన శరీరానికి చాలా అవసరం. అందుకే వీటి లోపాలను నిశ్శబ్ద అంటువ్యాధిగా పరిగణిస్తారు. ఈ విటమిన్ల లోపం  వల్ల ఎముకలు, హార్మోన్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఈ విటమిన్ల లోపం లేకుండా చూసుకోవాలి. ఉదయాన్నే కాసేపు ఎండలో కూర్చోవడం, పాలు, పుట్టగొడుగులు, పాల ఉత్పత్తులను తీసుకుంటే వీటి లోపం పోతుంది. 
 

click me!