పిల్లల్లో డి విటమిన్ తక్కువగా ఉందా..?

First Published Sep 7, 2022, 1:33 PM IST

సూర్య రశ్మి ద్వారా శరీరానికి విటమిన్ డి అందాలంటే... ఎండలో కనీసం 15 నుంచి 20 నిమిషాలపాటు ఉండాలట. ప్రతిరోజూ ఇలా ఉండటం వల్ల విటమిన్ డి మనకు లభిస్తుంది.
 

vitamin d

పిల్లలకు డి విటమిన్  చాలా అవసరం. డి విటమిన్ లోపం కారణంగా పిల్లల్లో అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే.. వారికి విటమిన్ డి కచ్చితంగా అందేలా చూసుకోవాలి. ఒకవేళ మీ పిల్లల్లో విటమిన్ డి లోపం కనుక ఉంటే ఈ కింద మార్గాల ద్వారా వారికి విటమిన్ అందేలా చేయవచ్చు.

1.మన శరీరానికి అవసరమైన విటమిన్ డి సూర్య రశ్మి నుంచి లభిస్తుంది. కాబట్టి... ఉదయం పూట ఎండలో గడపడం వల్ల సూర్య రశ్మి ద్వారా విటమిన్ డి లభించే అవకాశం ఉంది. అయితే.. ఎప్పుడుపడితే అప్పుడు ఎండలోకి వెళ్లి నాకు విటమిన్ డి రాలేదు అని అనకూడదు. ఒకప్పుడు ఉదయం 7, 8గంట సమయంలో ఎండలో ఉంటే విటమిన్ డి లభిస్తుందని చెప్పేవారు. కానీ... ఉదయం 10 తర్వాత నుంచి మధ్యాహ్నం 2 గంటల సమయంలోనే ఎక్కువగా సూర్య రశ్మిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుందట.

2.సూర్య రశ్మి ద్వారా శరీరానికి విటమిన్ డి అందాలంటే... ఎండలో కనీసం 15 నుంచి 20 నిమిషాలపాటు ఉండాలట. ప్రతిరోజూ ఇలా ఉండటం వల్ల విటమిన్ డి మనకు లభిస్తుంది.
 

3.దాదాపు 75శాతం పిల్లలకు కేవలం సూర్య రశ్మిలో గడపడం వల్ల విటమిన్ డి లభిస్తుందట. అలా కూడా సరిపోవడం లేదు అంటే.. అప్పుడు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి లేదంటే... ఫుడ్ రూపంలో తీసుకోవాలి.

4.అయితే.. విటమిన్ డి లభిస్తుంది కదా మరీ ఎక్కువ సేపు ఎండలో గడపకూడదు అని నిపుణులు చెబుతున్నారు. రోజులో 15 నుంచి 20 నిమిషాలు సరిపోతుందట. అంతకన్నా ఆ సమయంలో మరీ ఎక్కువ సేపు ఎండలో గడిపితే....యూవీ రేస్ ఎక్కువగా తగిలి... స్కిన్ క్యాన్సర్ లాంటివి వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందట.

5.ఇక ఆహారం రూపంలో విటమిన్ డి అందాలంటే... వెజిటేరియన్స్... మష్రూమ్స్ ని ఆహారం తీసుకోవచ్చు. మష్రూమ్స్ లో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది.
 

6.కోడిగుడ్డులో సైతం విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. కోడిగుడ్డు పచ్చసొనలో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. అయితే.... అలా అని మరీ ఎక్కువగా కోడిగుడ్డు తినకూడదు. రోజుకి ఒకటి మాత్రం తినొచ్చు.

7.విటమిన్ డి లోపం వల్ల శరీరంలో కాల్షియం తగ్గిపోతుంది. దీని వల్ల.. శరీరంలోని ఎముకలు బలహీనంగా మారి నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు కిడ్నీ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

click me!