ఇంటి దగ్గర ఈ మొక్కలుంటే పాములు రావడం పక్కా!

Kavitha GPublished : May 15, 2025 2:10 PM

పాములంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి.. అవి ఇంటి చుట్టు పక్కల తిరుగుతున్నాయంటేనే చాలామంది వణికి పోతుంటారు. మనం ఇంట్లో పెంచుకునే కొన్ని రకాల మొక్కలు పాములను ఆకర్షిస్తాయట. అవి ఇంట్లో ఉంటే పాముల బెడద తప్పదట. మరి ఆ మొక్కలెంటో ఓసారి తెలుసుకోండి.

15
ఇంటి దగ్గర ఈ మొక్కలుంటే పాములు రావడం పక్కా!

మల్లె చెట్టు..

ఓ అధ్యయనం ప్రకారం.. మల్లె మొక్క పాములను ఆకర్షిస్తుందట. ఈ మొక్క దట్టంగా ఉండటం వల్ల పాము తనని తాను దాచుకోవడం సులభం. ఆ మొక్క కింద దాక్కున్న తర్వాత పాము తన ఆహారాన్ని సులభంగా పట్టుకుంటుందట. అందుకే మల్లె మొక్కల దగ్గర పాములు ఉండే ప్రమాదం ఎక్కువట.

25
సైప్రస్ చెట్టు

ఇంటి దగ్గర ఖాళీ స్థలం ఉన్నవారు సైప్రస్ చెట్టు నాటుతుంటారు. ఇది అలంకార మొక్క. చూడటానికి అందంగా ఉంటుంది. కానీ దట్టంగా ఉంటుంది. దీని దట్టమైన కొమ్మల్లో పాములు దాక్కుని కీటకాలు, సాలెపురుగులను వేటాడతాయట.

35
క్లోవర్ మొక్కలు

క్లోవర్ మొక్కలు కూడా అలంకార మొక్కలే. దీని ఆకులు దళసరిగా, దట్టంగా ఉంటాయి. అవి నేలను పూర్తిగా కప్పేస్తాయి. అందుకే పాములు ఈ ఆకుల కింద దాక్కుని ఆహారం కోసం వెతుకుతుంటాయి. పొరపాటున కూడా ఇంట్లో క్లోవర్ మొక్కను నాటద్దట.

45
నిమ్మ చెట్టు

ఎలుకలు, చిన్న చిన్న పక్షులు నిమ్మ చెట్టు లేదా ఏదైనా సిట్రస్ చెట్టు దగ్గర నివసిస్తాయి. చిన్న కీటకాలు, పక్షులు దాని పండ్లను తినడానికి ఇష్టపడతాయి. అందుకే నిమ్మ చెట్ల చుట్టూ పాములు తిరుగుతూ ఉంటాయట. కాబట్టి ఇంటి చుట్టూ నిమ్మ లాంటి చెట్లు నాటకపోవడం మంచిది.

55
దేవదారు చెట్లు

దేవదారు చెట్లు చాలా ఎత్తుగా పెరుగుతాయి. కొందరు తమ పొలాల్లో దేవదారు చెట్లు నాటుతుంటారు. చందనం చెట్లలాగే పాములు.. దేవదారు చెట్ల చుట్టూ చుట్టుకోవడానికి ఇష్టపడతాయట. కాబట్టి ఇంటి దగ్గర దేవదారు చెట్లు నాటకపోవడం మంచిది.

Read more Photos on
click me!