అరటి పండు తిన్నాక చాలామంది ఆ తొక్కను విసిరి కొట్టేస్తారు. నిజానికి అలాంటి తొక్కలను మీ మొక్కలకు ఉపయోగిస్తే అవి పువ్వులు, పండ్లను గుత్తులు గుత్తులుగా కాసే అవకాశం ఉంది.
అరటిపండ్లు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. తిన్న తర్వాత చాలామంది వాటిని బయట విసిరి కొడతారు. వంటగదిలో ఇలాంటి వ్యర్ధాలు, మొక్కలకు మంచి ఎరువుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా అరటి తొక్కను మొక్కలకు వినియోగిస్తే మీరు ఊహించని విధంగా మొక్కలు ఎదుగుతాయి. పండ్లు, పూలను అతిగా కాస్తాయి. అరటి తొక్క మొక్కలకు సహజమైన సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనిలో పొటాషియం, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం వంటి అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మొక్కలకు అత్యవసరమైనవి.
25
అరటితొక్కలను మట్టిలో వేసి
అరటి తొక్కలను ఒక డబ్బాలో వేసి ఉంచండి. వాటిపై మట్టిని కలపండి. మట్టిలో అరటి తొక్కలు పూర్తిగా కలిసిపోయి ఎరువుగా మారతాయి. వాటిని తరచూ మొక్కలకి వేస్తూ ఉండండి. ఇలా వేసిన తర్వాత మొక్కల్లో తేడాను గమనించండి. అవి విపరీతంగా పువ్వులను కాస్తాయి. అలాగే పండ్లను కూడా ఇస్తాయి.
35
ఎలా ఉపయోగపడుతుంది?
అరటి తొక్కలో ఉండే పొటాషియం అనేది మొక్కల్లో పుష్పించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే పండ్లను కూడా అధికంగా కాసేలా చేస్తుంది. ఇక అరటి తొక్కలో ఉండే భాస్వరం మొక్కలు వేర్లను బలోపేతం చేస్తుంది. అలాగే అరటి తొక్కలో క్యాల్షియం కూడా ఉంటుంది. ఇది మొక్క కణాలను ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుంది. ఇక మెగ్నీషియం ఆకులను పచ్చగా ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది.
అరటి తొక్కలతో ఎరువును తయారు చేసి వేయవచ్చు. లేదా మొక్క ఉన్న మట్టిలోకి అరటి తొక్కలు లోతుగా చేతితో నొక్కడం ద్వారా కూడా చేయవచ్చు. లేదా అరటి తొక్కలను చిన్న చిన్న ముక్కలుగా కోసి మట్టితో కలిపి మొక్కలకు వేసేయవచ్చు. ఇది కొన్ని రోజులకి కుళ్ళి ఎరువుగా మారుతుంది.
55
అరటి తొక్కల పొడి
అరటి తొక్కలను ఎండబెట్టి ఆరబెట్టి పొడిలా చేయాలి. ఆ పొడిని మొక్కల వేర్లు దగ్గర వేస్తూ ఉండాలి. లేదా అరటి తొక్కలను కొన్ని రోజులు పాటు నీటిలో నానబెడితే నీరు జిగటగా మారుతుంది. వాటిని ద్రవ ఎరువులు అంటారు. మొక్కలకి ద్రవ ఎరువులు వేయడం వల్ల కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది. మొక్కలపై అరటి తొక్కల ప్రభావం చాలా ఎక్కువ. మొక్కలకు రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చిన్న కుండీల్లో పెరిగే మొక్కలకు ఈ అరటి తొక్క మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది.