ఇలా చేస్తే కిచెన్ టైల్స్‌ పై నూనె మరకలు లేకుండా పోతాయ్

Published : Aug 27, 2025, 03:48 PM IST

కిచెన్ టైల్స్‌పై  నూనె మరకలు ఉండటం కామన్. కానీ వీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోతే అవి మొండిగా అవుతాయి. ఏం చేసినా పోవు. అయితే ఇలాంటి మరకలను సులువుగా పోగొట్టడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

PREV
15
కిచెన్ టైల్స్

ప్రతి ఒక్కరి కిచెన్ లోని గోడలకు, టైల్స్ కు నూనె మరకలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక ఈ నూనెను క్లీన్ చేయకపోతే వాటికి దుమ్ము, ధూళి వంటివి అంటుకుని అవి మరకలుగా కనిపిస్తాయి. అలాగే వాటిపై బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది. దీనివల్ల ఆ మరకల నుంచి దుర్వాసన కూడా వస్తుంది. అయితే ఈ మరకలను కొన్ని వస్తువులతో సులువుగా పోగొట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

25
బేకింగ్ సోడా

ప్రతిఒక్కరి కిచెన్ లో ఉండే బేకింగ్ సోడాతో నూనె మరకలను సులువుగా పోగొట్టొచ్చు. ఇందుకోసం బేకింగ్ సోడాలో కొన్ని నీళ్లు కలిపి పేస్ట్ చేయాలి. దీన్ని నూనె మరకలపై రాసి 10 నిమిషాల తర్వాత స్క్రబ్బర్ తో రుద్దితే మరకలు లేకుండా పోతాయి. 

35
వెనిగర్

వినెగర్ కూడా నూనె మరకలను పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అంతేకాదు ఇది క్రిములను కూడా నాశనం చేస్తుంది. ఇందుకోసం సగం బాటిల్లో నీళ్లు, మిగతా సగం వెనిగర్ ను పోసి కలపండి. దీన్ని కిచెన్ టైల్స్ పై స్ప్రే చేయండి. 10 నిమిషాల తర్వాత తడి క్లాత్ తో తుడిచేస్తే టైల్స్ కొత్తవాటిలా మెరుస్తాయి. 

45
నిమ్మకాయ

నిమ్మకాయతో కూడా మీరు ఈజీగా కిచెన్ టైల్స్ మరకలను పోగొట్టొచ్చు.  ఇందుకోసం నిమ్మకాయను సగానికి కోసి దానిపై ఉప్పును చల్లండి. దీన్ని టైల్స్ మరకలకు రుద్దండి. నిమ్మకాయలోని ఆమ్లం నూనె మరకలను సులువుగా పోగొడుతుంది. 

55
వేడి నీళ్లు

వేడినీళ్లతో కూడా మీరు మురికి టైల్స్ ను కొత్తవాటిలా మెరిసేలా చేయొచ్చు. ఇందుకోసం ఒక బకెట్ వేడి నీళ్లలో రెండు స్పూన్ల డిష్ వాష్ లిక్విడ్ ను కలపండి. దీంట్లో క్లాత్ ను ముంచి గోడలను తుడవండి. అంతే మరకలు లేకుండా పోతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories