ఈ డ్రై ఫ్రూట్ బరువును తగ్గించడమే కాదు.. ఎముకలను బలంగా చేస్తుంది కూడా..

First Published Jul 1, 2022, 1:28 PM IST

బరువు తగ్గడానికి గంటల తరబడి వ్యాయామాలు చేస్తుంటారు. కఠినమైన డైట్ ను కూడా ఫాలో అవుతుంటారు. వీటితో పాటుగా ఈ డ్రై ఫ్రూట్స్ ను తింటే మీరు చాలా ఫాస్ట్ గా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. 

డ్రై ఫ్రూట్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఎన్నో అనారోగ్య సమస్యలను తరిమికొడతాయి. అందుకే డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువగా తినాలని సలహానిస్తుంటాయి. డ్రై ఫ్రూట్స్ లో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందులో ఒకటైన పిస్తా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దీనిలో సహజ కొవ్వులు ( Natural fats), ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు,  కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పిస్తాపప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

పిస్తాపప్పులను ఏదైనా రెసిపీలో లేదా స్వీట్లలో వేసినా చాలా రుచిగా అవుతాయి. అంతేకాదు ఈ పిస్తాలు బెల్లీ ఫ్యాట్ ను కరిగించడంలో కూడా ముందుంటాయి. 
 

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

పిస్తా పప్పులు బరువును తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. పిస్తాపప్పులో ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీన్ని తినడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి. బరువు తగ్గాలనుకునే మీ రోజు వారి ఆహారంలో కొన్ని పిస్తాపప్పులను చేర్చండి. 
 

ఎముకలు దృఢంగా అవుతాయి

వయసు మీద పడుతున్న కొద్దీ ఎన్నో రోగాలు చుట్టుకునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా శరీరంలో శక్తి తగ్గడంతో పాటుగా ఎముకలు కూడా బలహీన పడతాయి. ఇంకొంతమంది చిన్న వయసులో ఎముకల బలహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారు పిస్తా పప్పులను తప్పని సరిగా తినాలి. ఎందుకంటే వీటిలో విటమిన్లు, ప్రోటీన్లు, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడమే కాదు.. ఎముకలను దృఢంగా చేస్తాయి కూడా.

 మధుమేహాన్ని నియంత్రిస్తాయి 

కేవలం మన దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మధుమేహుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. డయాబెటీస్ పేషెంట్లు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వేళ మీరు డయాబెటీస్ పేషెంట్లు అయితే వెంటనే మీ అల్పాహారంలో పిస్తాలను చేర్చుకోండి. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ ను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. 
 

జ్ఞాపకశక్తి పెరుగుతుంది

కొంతమంది విషయాలను చాలా తొందరగా మర్చిపోతుంటారు. కొన్ని కొన్ని సార్లు ఇంట్లో వాళ్ల పేర్లే గుర్తుండవు. అలాంటి వారు పిస్తాలను తించే చక్కటి ఫలితం ఉంటుంది. రెగ్యులర్ గా పరిమితిలో పిస్తాలను తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 

pista

పిస్తాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. అందుకే వీటిని మీ రోజు వారి ఆహారంలో తప్పక చేర్చండి. 

click me!