Jagannath Rath Yatra 2022: జగన్నాథ రథయాత్ర సందర్భంగా మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు, గ్రీటింగ్స్ తెలియజేయండి

First Published Jul 1, 2022, 11:43 AM IST

Jagannath Rath Yatra 2022: ప్రతి ఏడాది ఒడిషాలోని పూరీలోని ప్రసిద్ద జగన్నాథ ఆలయం నుంచి జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవైంగ నిర్వహించబుతుంది. ఈ ప్రత్యేక పర్వదినాన మీ ప్రియమైన వారికి, బంధువులకు శుభాకాంక్షలు తెలపండి.
 

ఒడిషాలోని పూరీలోని ప్రసిద్ధ జగన్నాథ ఆలయం నుంచి ప్రతి ఏడాది జగన్నాథ రథయాత్రను నిర్వహిస్తారు. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. విష్ణుమూర్తి అవతారంలో దర్శమిచ్చే ఆ జన్నాథుడిని ఈ రథయాత్ర సందర్బంగా ఎంతో మంది భక్తులు అక్కడకు తరలి వచ్చి ఈ భగవంతుని ఆశిస్సులను పొందుతారు. 

జగన్నాథుని అన్న అయిన  బలరాముడిని, సోదరి సుభద్రలను కూడా ఈ శుభ సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పూరీ వీధుల గుండా ఆ జగన్నాథుడు ఈ యాత్రలో పాల్గొంటాడు. జగన్నాథుడిని మూడు పెద్ద చెక్క రథాలపై ప్రతిష్టిస్తారు. ఈ రథయాత్ర పూరీ వీధుల గుండా ప్రారంభమై గుండిచా ఆలయంతో ముగుస్తుంది.

ఈ పండుగ హిందువులకు ఎంతో ప్రత్యేకమైంది. గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ సందర్భంగా జగ్గనాథ యాత్రలో తమ ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలుపుతారు. జగన్నాథ రథయాత్ర 2022 సందర్భంగా  శుభాకాంక్షలు, ఈ సందేశాలు, వాట్సాప్ శుభాకాంక్షలను మీ స్నేహితులతో, మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి.
 

జగన్నాథ రథయాత్ర సందర్భంగా.. మీరు, మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండండి.  చెడుతో పోరాడటానికి తగినంత శక్తిని ఆ భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. 

ఆ జగన్నాథుడు మీ జీవితం ఉత్తమ మార్గంలో నడిచేలా ఆశీర్వదిస్తాడు.  మీకు, మీ కుటుంబానికి రథయాత్ర శుభాకాంక్షలు.
 

జగన్నాద రథయాత్ర 2022 : ఈ పవిత్ర రోజు సందర్భంగా జగన్నాథుడు మిమ్మల్ని శాంతి, సౌభాగ్యం, ఆనందంగా ఉండేలా ఆశీర్వదిస్తాడని మేము ఆశిస్తున్నాము.
 

జగన్నాథుడు ఈ సంవత్సరం ప్రతి ఒక్కరినీ విజయం, ఆనందం, శ్రేయస్సుతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. హ్యాపీ జగన్నాథ రథయాత్ర
 

రథయాత్ర సందర్భంగా ఈ సంవత్సరం ఒకసారి జగన్నాథ రథాన్ని లాగండి. మీ సమస్యలన్నీ పోతాయి. అలాగే ఆనందమైన జీవితాన్ని గడుపుతారు. 
 

మీ కష్టకాలాలన్నీ తొలగిపోయి, మీకు సమృద్ధి, విజయం, సంతోషం కలగాలి. మీరు ఉన్నత స్థితికి చేరుకోవాలి. హ్యాపీ రథయాత్ర..

click me!