World Laughter Day 2022: నవ్వండి.. నవ్వించండి.. నవ్వుతోనే అందమైనా.. ఆరోగ్యమైనా..

First Published Jul 1, 2022, 12:35 PM IST

World Laughter Day 2022: నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వక పోవడం ఒక రోగం అన్న సామేత ఊరికే రాలేదు. ఒక చిన్న నవ్వుతో ఎన్నో సమస్యలు మటుమాయం అవుతాయి మరి. ఇంతటి గొప్పనైన నవ్వు ఎన్ని రోగాలను నయం చేస్తుందో తెలుసా..

నేటి మనుషుల ముఖాల్లో అలసట, ఒత్తిడి, కోపం, ఆందోళన వంటి ముఖ కవలికలే కనిపిస్తున్నాయి తప్ప.. చిన్న చిరునవ్వు కనిపించడం లేదు. మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని నెలలు అవుతుందో, ఎన్ని సంవత్సరాలు అవుతుందో అనే వారు కూడా లేకపోలేదు.  

ఒత్తిడితో కూడిన లైఫ్ స్టైల్ కారణంగా నవ్వు అంటే ఏంటి అనే పరిస్థితికి వచ్చారు చాలా మంది. తినడానికే సరిగ్గా టైం లేని లైఫ్ లో  మనస్ఫూర్తిగా ఎలా నవ్వాలి అనే వారు కూడా ఉన్నారండోయ్. కానీ నవ్వు మన పాణానికి ఎంతో మంచిది. పెదాలపై చిన్న చిరునవ్వు ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది. మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. 

ఒత్తిడిలో ఎలా నవ్వడం అంటారు. కాసేపు మీ దోస్త్ లతో జోక్స్ వేసుకుని నవ్వండి. ఒత్తిడంతా పటాపంచలై పోతుంది. మీ వర్క్ కూడా ఫాస్ట్ గా అయిపోతుంది. పనిలో కొన్నే కొన్ని నిమిషాలు మీ ఫ్రెండ్స్ తో ముచ్చటేయండి. జోక్స్ చెప్పుకోండి. కొద్ది సేపు నవ్వుకోండి. ఇది మీ మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ రోజు ప్రపంచ నవ్వుల దినోత్సవం. ఈ సందర్భంగా నవ్వు వల్ల కలిగే లాభాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 

టెన్షన్ తగ్గుతుంది: కొద్ది సేపు నవ్వడం వల్ల శారీరక ఒత్తిడి తగ్గిపోతుంది. అంతేకాదు నవ్వుతో రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. 

అవయవాలను ఉత్తేజ పరుస్తుంది: ఆక్సిజన్ శోషణకు నవ్వు ఎంతనాగో సహాయపడుతుంది. నవ్వుతో శరీరంలోని కండరాలు, గుండె, ఊపిరితిత్తులు ఉత్తేజంగా మారుతాయి. అలాగే ఒంటి నొప్పులను తగ్గించే ఎండార్పిన్ లెవెల్స్ ను పెంచడంలో కూడా నవ్వు సహాయపడుతుంది. 

శరీరానికి విశ్రాంతినిస్తుంది: కొన్ని నిమిషాల పాటు మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల ఒత్తిడిని కలిగించే హార్మోన్లు తగ్గిపోతాయి. దీంతో మీ శరీరం రిలాక్స్ గా ఫీలవుతుంది. ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే ప్రతిరోజూ కాసేపు నవ్వండి. నవ్వించండి. 

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది: నవ్వు రోగ నిరోధక శక్తిని కూడా పెంచగలదు. నవ్వుతో న్యూరోపెప్టైడ్లు విడుదల అవుతాయి. ఇవి  వివిధ అనారోగ్య సమస్యలతో పోరాడుతుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు నవ్వుతో నెగిటీవ్ థాట్స్ అనీ పోతాయి. 

రెగ్యులర్ గా నవ్వే వ్యక్తి చాలా ఆరోగ్యంగా ఉంటాడని నిపుణులు చెబుతున్నారు. నవ్వడం వల్ల మూడ్ స్వింగ్స్, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరమవుతాయి. అంతేకాదు నవ్వుతో శరీర నొప్పులు వాటంతట అవే పోతాయట. 

click me!