కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు ఈ ఆహారాలను అస్సలు తినకూడదు..

First Published Sep 6, 2022, 1:00 PM IST

మూత్రపిండాల్లో రాళ్లున్న వారికి పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి పుడుతుంది. అంతేకాదు వికారం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు కూడా వస్తాయి. 

మన దేశంలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో  బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. మన శరీరంలో మూత్రపిండాలు ముఖ్యమైన భాగం. ఇవి సక్రమంగా పనిచేస్తేనే రక్తం ఫిల్టర్ అవుతుంది. అయితే ఈ ప్రాసెస్ లో సోడియం, కాల్షియం తో పాటుగా ఎన్నో రకాల ఖనిజాలు మూత్రాశయానికి చేరుకుంటాయి. ఇక్కడ వీటి పరిమాణం పెరిగిపోయి.. రాళ్లలాగ మారడం ప్రారంభమవుతాయి. వీటితే మూత్రపిండాల్లో రాళ్లు అంటారు. 

మూత్రపిండాల్లో సమస్య వల్ల పొత్తికడుపులో విపరీతమైన నొప్పి, మూత్రానికి వెళ్లినప్పుడు నొప్పి, మాటిమాటికి మూత్రం రావడం, మైకం, వికారం, జ్వరం వంటి సమస్యలు వస్తాయి. అయితే కిడ్నీళ్లో రాళ్ల సమస్యతో బాధపడేవారు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. అవేంటో తెలుసుకుందాం పదండి.. 

విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలు

మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటివల్ల కిడ్నీల్లో రాళ్లు మరింత ఎక్కువ అవుతాయి. నారింజ, నిమ్మ, బచ్చలికూర, కివి,  జామ వంటి ఆహారాల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని తినడం మానుకోండి. 
 

శీతల పానీయాలు, టీ, కాఫీ

మూత్రపిండాల్లో స్టోన్స్ ఉన్నవాళ్లు తరచుగా మూత్ర విసర్జన చేస్తుంటారు. దీనివల్ల వీరు తరచుగా డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు. ఇలాంటి పరిస్థితిలో వీరు టీ, కాఫీ లను తాగడం సేఫ్ కాదు. ఎందుకంటే వీటిలో కెఫిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడేస్తుంది. అందుకే కిడ్నీల్లో రాళ్లున్న వారు టీ, కాఫీ, శీతల పానీయాలను తాగకూడదు. ఇవి వీరికి విషంతో సమానం. 
 

salt

ఉప్పు

మూత్రపిండాల్లో  రాళ్ల సమస్యతో బాధపడేవారు ఉప్పును ఎక్కువగా తీసుకోకూడదు. ఉప్పు కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాల జోలికి వెల్లకపోవడమే మంచిది. ఎందుకంటే సోడియం కంటెంట్ వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి. 

మాంసాహారం

మూత్రపిండాల్లో రాళ్లున్న వారికి మాంసాహారం విషంతో సమానం.  ఎందుకంటే వీటిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన శరీరానికి అత్యవసరం అయినప్పటికీ.. ఇవి మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపెడుతాయి. అందుకే గుడ్లు, చికెన్, చేపలు వంటివి తినకండి. 
 

చాక్లెట్లు

చాక్లెట్లు అంటే ఎంత ఇష్టమున్నా కిడ్నీల్లో రాళ్లుంటే మాత్రం చాక్లెట్లను తినకపోవడమే మంచిది. మీ కిడ్నీల్లో రాళ్లు పూర్తిగా తొలగిపోయినాకనే తినండి. ఎందుకంటే వీటిలో ఉండే ఆక్సలేట్ వల్ల రాళ్లు ఎక్కువవుతాయి. అందుకే వీటిని మాత్రం తినకండి. 
 

click me!