మన చుట్టూ ఉన్నవారందరూ మనకు మంచి చేస్తారు అనే గ్యారెంటీ లేదు. మనతో చాలా మంది మంచిగా ఉంటూనే ద్రోహం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రిలేషన్ లో ఉన్నవారు... తమ పార్ట్ నర్ ని సులభంగా ద్రోహం చేస్తూ ఉంటారు. ఒక రిలేషన్ లో ఉన్నవారు.. తమ పార్ట్ నర్ ని మోసం చేసి.. మరోకరితో రిలేషన్ పెట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కాగా.. నిజానికి ద్రోహం చేసేవారు ఎలా ప్రవర్తిస్తారో ఓసారిచూద్దాం..
1.ద్రోహం చేసేవారు ఎక్కువగా గొడవలు పడుతూ ఉండరు. వీరికి గొడవలు అంటే పెద్దగా నచ్చదు. కామ్ గా..టైమ్ వచ్చినప్పుడు ద్రోహం చేసి పక్కకు వెళ్లిపోతారు. కానీ... గొడవలు పెట్టుకోవడం మాత్రం వీరికి నచ్చదు. ఎందుకంటే వీరికి పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో వారికి అర్థం కాదు.
2.ఒకవేళ ఎవరైనా తమ జీవిత భాగస్వామికి ద్రోహం చేయాలి అనుకుంటే... వారితో ముందు నుంచే సెక్స్ లైఫ్ కి దూరంగా ఉండటం మొదలుపెడతారట. మరొకరితో రిలేషన్ పెట్టుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి.. తమ పార్ట్ నర్ కి దూరంగా ఉండటం మొదలుపెడతారు.
3.అంతేకాదు... ముఖ్యంగా భాగస్వామిని ద్రోహం చేయాలి అనుకునేవారు.. ఇతరుల నుండి ముందు నుంచే మద్దతు కోరుకుంటారు. ఎందుకంటే... వీరికి తమ భాగస్వామి నుంచి మద్దతు లభించదు కాబట్టి... ఇతరుల నుంచి కూడపెట్టుకోవడం మొదలుపెడతారు. తర్వాత భవిష్యత్తులో తాము చేసింది తప్పు కాదు అని చెప్పడానికి ఎవరైనా ఉండాలి కదా అని వీరు చూస్తూ ఉంటారు.
4.ఎవరైనా తమ పార్ట్ నర్ ని మోసం చేసి మరొకరితో ఎఫైర్ పెట్టుకుంటారో వారిలో సడెన్ గా మార్పులు వస్తాయట. అన్నింటికీ థ్రిల్ గా ఫీలౌతారు, స్పాంటేనియస్ గా మాట్లాడటం లాంటివి చేస్తారు. అదేవిధంగా.. తమ పార్ట్ నర్ తో రిలేషన్ ని చాలా బోరింగ్ గా ఫీలౌతారు.
5.మన దేశంలో చాలా మంది ఒకే భార్యని కలిగి ఉండటాన్ని నమ్ముతుంటారు. కానీ.. ఎవరైతే తమ పార్ట్ నర్ ని మోసం చేయాలని అనుకుంటారో వారు... బహు భార్యతత్వాన్ని ఇష్టపడతారు. వారికి ఎప్పుడూ అలాంటి ఆలోచనలు మాత్రమే ఉంటాయి.
cheating
6.ఇక తమ పార్ట్ నర్ ని మోసం చేసేవారు... వారు చేసే పనులను వారు సమర్థించుకుంటూ ఉంటారు. వారు చేసేది తప్పు అని వీరు అస్సలు అంగీకరించరు. తాము చేసిన పనిని తాము సమర్థించుకుంటూ ఉంటారు.
7.తమ పార్ట్ నర్ ని మోసం చేయాలనే ఆలోచన ఉన్నవారు.. తమ ఫిజిక్ విషయంలో ఎక్కువ ఫోకస్ గా ఉంటారు. వీరు... ఎక్కువగా ఎదుటివారి ఫిజిక్ ని చూసి ఎక్కువగా ఆకర్షితులౌతూ ఉంటారు. వారితో రిలేషన్ పెట్టుకోవాలని ఆత్రుత పడుతూ ఉంటారు.