జ్వరం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితిలో వీటిని తినకండి.. లేదంటే బాడీ టెంపరేచర్ పెరుగుతుంది జాగ్రత్త..

Published : Sep 06, 2022, 12:00 PM IST

వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్, జ్వరం రావడం చాలా కామన్. అయితే జ్వరం వచ్చినప్పుడు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండకపోతే ఆ  జ్వరం మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. 

PREV
18
జ్వరం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితిలో వీటిని తినకండి.. లేదంటే బాడీ టెంపరేచర్ పెరుగుతుంది జాగ్రత్త..

జ్వరం వచ్చినప్పుడు ఏదీ తినాలనిపించదు. ఏది తిన్నా చేదుగానే ఉంటుంది. అందులో ఇలాంటి సమయంలో కారం కారంగా తినాలనిపిస్తుంది. కానీ జ్వరం వచ్చినప్పుడు కొన్నిరకాల ఆహారాలకు చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆ ఆహారాలు శరీర ఉష్ణోగ్రతను మరింత పెంచుతాయి. 

28

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే జ్వరం వచ్చినప్పుడు శరీరం నీరసంగా మారుతుంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలి. పుష్కలంగా నీరు, కొబ్బరి నీరు, పండ్ల రసాలను తాగాలి. ఇవి మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. ఇది మిమ్మల్ని త్వరగా కోలుకోవడానికి  సహాయపడుతుంది. మరి జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి ఆహారాలను తినకూడదో తెలుసుకుందాం పదండి.. 

38

జంక్ ఫుడ్

జ్వరం వచ్చినప్పుడు ఎంత కారం కారంగా తినాలనిపించినా.. జంక్ ఫుడ్ ను మాత్రం ఎట్టి పరిస్థితిలో తినకూడదు. ఎందుకంటే జంక్ ఫుడ్ లో కార్భోహైడ్రేట్లు, కేలరీలు, మసాలా దినుసులు,  నూనె ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇలాంటి సమయంలో అవి అంత త్వరగా జీర్ణం కావు. ఇవి జీవక్రియను బలహీనపరుస్తాయి. 

 

48

స్పైసీ ఫుడ్

జ్వరం వచ్చినప్పుడు సాదాసీదాగా ఆహారాన్నే తినాలి. కారంగా ఉండే ఆహారాలను అస్సలు తినకూడదు. కారంగా ఉండే ఆహారాలను తినడం వల్ల మీ శరీరంలో నిర్జలీకరణం ఏర్పడుతుంది జ్వరం కూడా పెరుగుతుంది.
 

58
fiber

ఫైబర్ 

జ్వరంలో మీరు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తినాలి. ఎందుకంటే ఇలాంటి సమయంలో జీర్ణ వ్యవస్థను బలహీనంగా ఉంటుంది. అందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల జీర్ణంలో ఎక్కువ శక్తి  వినియోగించబడుతుంది. దీనివల్ల మీరు రికవరీ అవడం లేటవుతుంది. శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. కాబట్టి జ్వరం ఉన్నప్పుడు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తినకండి. 
 

68

పాలు లేదా పాల ఉత్పత్తులు

జ్వరంగా ఉన్నప్పుడు పాలను గానీ.. పాల ఉత్పత్తులను గానీ తీసుకోవడాన్ని తగ్గించాలి. ఎందుకంటే వీటిని జీర్ణం చేయడానికి శక్తి ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాగే జీర్ణక్రియ సరిగ్గా పనిచేయదు. దీనివల్ల మలబద్దకం సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 
 

78

టీ ,కాఫీ

జ్వరంగా ఉన్నప్పుడు కెఫిన్ ఉండే టీ, కాఫీ, ఆల్కహాల్ ను అస్సలు తాగకూడదు. ఎందుకంటే ఇది మీ శరీరాన్ని డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను కూడా బలహీనపరుస్తుంది. అందుకే జ్వరం ఉన్నప్పుడు వీటి జోలికి వెళ్లకండి. కావాలనుకుంటే 1 నుంచి 2 కప్పుల బ్లాక్ టీ లేదా కాఫీనిన తాగొచ్చు. 

88

తీపి పదార్థాలు

జ్వరం వస్తే నోరంతా చేదుగా అనిపిస్తుంది. అందుకే చాలా మంది తీపి పదార్థాలను తింటుంటారు. కానీ జ్వరం వచ్చినప్పుడు స్వీట్ ఐటమ్స్ ను తినడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఇది మీ రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. వీటికి బదులుగా కొబ్బరి నీరు, పండ్ల రసాలను తాగండి. 

Read more Photos on
click me!

Recommended Stories