రోజూ మౌత్ వాష్ ను ఉపయోగించడం అస్సలు మంచిది కాదు.. క్యాన్సర్ వంటి ఎన్నో రోగాలొస్తయ్ జాగ్రత్త..

First Published Nov 1, 2022, 10:55 AM IST

నిజానికి మౌత్ వాష్ చేయడం మంచి అలవాటు. కానీ మౌత్ వాష్ లల్లో ఎన్నో రకాల రసాయనాలను కలుపుతారు. వీటివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. 
 

నోట్లో సూక్ష్మజీవులు పేరుకుపోతే.. నోట్లు నుంచి మురికి వాసన వస్తుంది. నోట్లో వాసనను  అంత సులువుగా వదిలించుకోలేం. కొంతమంది రోజుకు రెండు సార్లు బ్రష్ చేసినా నోట్లో నుంచి అలాగే బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. నిజానికి నోట్లో చెడు బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు పేరుకుపోతే ఒక్క బ్యాడ్ స్మెల్ యే కాదు.. చిగుళ్ల వాపు, పంటి నొప్పితో సహా ఎన్నో దంత సమస్యలు వస్తాయి. అందుకే ఈ రోజుల్లో చాలా మంది నోటి పరిశుభ్రతను పాటిస్తున్నారు. అయితే దంతాలు, చిగుళ్లు బలంగా ఉండేందుకు మౌత్ వాష్ లు బాగా ఉపయోగపడతాయి. కానీ  ప్రతిరోజూ మౌత్ వాష్ చేయడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.  
 

మౌత్ వాష్ ఎలా ఉపయోగపడుతుంది

మౌత్ వాష్ ను నోట్లో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. నోటిని శుభ్రం చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. దీనిని ఉపయోగించడం వల్ల నోటికి సంబంధించిన ఎన్నో రోగాల ప్రమాదం తప్పుతుంది. నోట్లో ఉండే బ్యాక్టీరియా నోటి దుర్వాసనకు, దంతక్షయానికి కారణమవుతుంది. అందుకే మౌత్ వాష్ లను ఉపయోగించాలని నిపుణులు చెబుతుంటారు. మౌత్  వాష్ వల్ల రీఫ్రెష్ గా అనిపిస్తుంది. కానీ వీటిని రోజూ ఉపయోగించడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. అవేంటంటే.. 

క్యాన్సర్

మౌత్ వాష్ లను ఎక్కువగా ఉపయోగిస్తే క్యాన్సర్ ప్రమాదం చాలా వరకు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మౌత్ వాష్ లల్లో క్యాన్సర్ కు కారణమయ్యే సింథటిక్ పదార్థాలుంటాయి. నోటిని క్లీన్ చేసే మౌత్ వాష్ లను వాడటం వల్ల తల, మెడ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

నోరు పొడిబారుతుంది

మౌత్ వాష్ లో ఉండే పదార్థాలు చెడు బ్యాక్టీరియాను తొలగిస్తాయి. అంతేకాదు ఇవి నోటి చర్మాన్ని కూడా దెబ్బతీస్తాయి. మౌత్ వాష్ ను ఉపయోగించడం వల్ల నోటి చర్మం గరుకుగా మారుతుంది. నోరు పొడిబారుతుంది కూడా. అందుకే వీటిని ఎక్కువగా ఉపయోగించకూడదు.
 

నోట్లో దురద

చాలా మౌత్ వాష్ లను తయారుచేయడానికి ఆల్కహాల్ ను కూడా ఉపయోగిస్తుంటారు. ఇలాంటి వాటిని ఉపయోగించినప్పుడు నోట్లో చికాకు కలుగుతుంది. అంతేకాదు నోరు ఎర్రగా మారుతుంది కూడా. అందుకే వీటిని డైలీ యూజ్ చేయకండి. 

దంతాల సమస్యలు

రెగ్యులర్ గా మౌత్ వాష్ లను ఉపయోగించడం వల్ల దంత సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మౌత్ వాష్ ల వల్ల దంతాలపై మచ్చలు ఏర్పడతాయి. దంతాలు గరుకుగా, బలహీనంగా అవుతాయి. దీనివల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. 
 

నేచురల్ మౌత్ వాష్ ను తయారుచేసుకోవచ్చు

మార్కెట్ లో ఉండే కెమికల్స్ మిక్స్ చేసిన మౌత్ వాష్ ల వల్ల లేనిపోని రోగాలొస్తాయ్. అందుకే  వీటిని రోజూ వాడకూడదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వీటిని రెండు రోజుకు ఒక సారి మాత్రమే ఉపయోగించాలి. పుదీనా లేదా వేప తో  ఇంట్లోనే నేచురల్ మౌత్ వాష్ ను తయారుచేసుకుని రోజూ వాడొచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.  
 

click me!