ఈ పచ్చి ఆకు ఒక్కటి చాలు గుండెపోటుతో సహా ఎన్నో రోగాలను దూరం చేయడానికి..

First Published Nov 1, 2022, 9:57 AM IST

చెడు ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవన శైలి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల చిన్న వయసు వారు కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. దీనిముప్పు తప్పేందుకు ఒక మూలిక మీకు ఔషదంలా పనిచేస్తుంది. అందేంటంటే.. 

heart attack

కాలాలు మారుతుంటే వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి. వీటివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కొందరికి జ్వరం వస్తే.. ఇంకొందరికి దగ్గు, జలుబు, దగ్గు వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.  వీటితో పాటుగా హార్ట్ ఎటాక్, క్యాన్సర్ కేసులు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. ఒకప్పుడు గుండెపోటు 60 ఏండ్లు దాటిన వారికి మాత్రమే వచ్చేవి. ఇప్పుడు 30 ఏండ్లు నిండితే చాలు గుండెపోటుతో సహా ఎన్నో ప్రాణాంతక రోగాలు వస్తున్నాయి. రోజూ వ్యాయామం చేస్తూ.. ఆరోగ్యాకరమైన ఆహారాలను తింటే ఈ రోగాల నుంచి మీరు తప్పించుకుంటారు. వీటితో పాటుగా ఒక ఆకు కూడా ఈ రోగాలను దూరం చేస్తుంది. అదే తులసి ఆకులు. 

tulsi

తులసి ఆకుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ప్రతి ఇంటి ముందు తులసి మొక్క ఖచ్చితంగా ఉంటుంది. లక్ష్మీదేవి ఈ  మొక్కలోనే నివసిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ మొక్కకు వారం వారం పూజలు చేస్తుంటారు. మతపరమైన విషయాలను పక్కన పెడితే.. ఇది మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఎందుకంటే దీనిలో ఉండే ఔషదగుణాలు క్యాన్సర్ నుంచి గుండె జబ్బుల వరకు ఎన్నో ప్రాణాంతక రోగాలను నయం చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తులసి మొక్క రెండు రకాలుగా ఉంటుంది. ఆకుపచ్చని ఆకులు ఉన్న తులసిని రామ్ తులసి అని పిలుస్తారు. ముదురు రంగు ఆకులున్న తులసిని శ్యామ్ తులసి అని పిలుస్తారు. 

tulsi

సీజనల్ వ్యాధులకు తులసి దివ్య ఔషదం

రెండు రకాల తులసి మొక్కల పోలికలు ఒకే విధంగా ఉంటాయి. అయితే ఆకు పచ్చని ఆకులుండే రామ్ తులసిలో అద్బుతమైన ఆయుర్వేద గుణాలుంటాయని నిపుణులు అంటున్నారు. ఈ ఆకుల్లో యాంటీ క్యాన్సర్ లక్షణాలుంటాయి. అంతేకాదు వీటిలో యాంటీ  ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి గుండెపోటు, డయాబెటీస్ ప్రమాదాలను తగ్గిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యం, కాంతివంతంగా చేయడానికి సహాయపడతాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అలాగే సీజనల్ రోగాల నుంచి మనల్ని రక్షిస్తాయి. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి. కఫం, దగ్గు, రక్తహీనత, కడుపునకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. వీటిని తింటే ఆకలి బాగా అవుతుంది. జీర్ణక్రియ కూడా మెరుగ్గా జరుగుతుంది. 
 

tulsi tea

తులసిని ఎలా ఉపయోగించాలి? 

తులసి ప్రయోజనాలను పొందడానికి దీని ఆకులను ఎలా ఉపయోగించాలంటే.. గ్లాస్ నీటిని తీసుకుని అందులో 2 లేదా 3 రామ్ తులసి ఆకులను వేసి బాగా మరిగించండి. ఈ నీటిని వడకట్టి టీలా తాగొచ్చు. దీనివల్ల గొంతు సమస్యలన్నీ పోతాయి. మీరు తాగే టీలో తులసి ఆకలును కూడా వేసుకోవచ్చు. లేదా వీటితో కాషాయాన్ని తయారుచేసుకుని కూడా తాగొచ్చు. ఇవన్నీ మీ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే సీజనల్ వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. ఉదయం పరిగడుపున రోజూ రెండు మూడు తులసి ఆకులను నమిలితే ఆరోగ్యానికి చాలా మంచిది. 
 

click me!