Old Bedsheets: మనలో చాలా మంది పాత బెడ్‌షీట్లను పడేస్తుంటారు. అయితే కాస్త తెలివిగా ఆలోచిస్తే వాటిని ఉపయోగపడే వస్తువులుగా మారతాయి. ఇది పర్యావరణానికి మేలు చేయడంతో పాటు మీ ఇంటి అందాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. ఇంతకీ పాత బెడ్ షీట్లతో ఏం చేయొచ్చంటే
పాత బెడ్‌షీట్లను ఫర్నిచర్ కవర్‌లుగా వాడటం చాలా సులభమైన ఐడియా. ఇంట్లో పెయింటింగ్, రిపేర్ వర్క్ లేదా షిఫ్టింగ్ జరుగుతున్నప్పుడు సోఫా, టేబుల్, కుర్చీలు వంటి వాటిపై కప్పేస్తే ధూళి, మురికి పడకుండా కాపాడుతుంది. కొత్త కవర్లు కొనాల్సిన అవసరం ఉండదు. పెద్ద సైజులో ఉండే బెడ్‌షీట్లు సులభంగా అన్ని ఫర్నిచర్‌ను కవర్ చేస్తాయి. అవసరమైతే వాటిని కట్ చేసి కూడా వాడొచ్చు. ఇది తక్కువ ఖర్చుతో పాటు చాలా ఉపయోగకరమైన పద్ధతి.
25
పెంపుడు జంతువులకు బెడ్‌గా వాడండి
మీ ఇంట్లో కుక్కలు లేదా పిల్లులు ఉంటే పాత బెడ్‌షీట్లు చాలా ఉపయోగపడతాయి. వాటితో జంతువులకు సాఫ్ట్ బెడ్ తయారు చేయొచ్చు. నేలపై పరచినా సరే, లేదా చిన్న కుషన్‌లా కుట్టినా సరే అవి కంఫర్ట్‌గా ఉంటాయి. ఈ కవర్లను సులభంగా ఉతికి మళ్లీ వాడొచ్చు. కొత్త పెట్ బెడ్ కొనాల్సిన అవసరం ఉండదు. ఇది శుభ్రతను కూడా మెరుగుపరుస్తుంది.
35
ఇంటి శుభ్రతకు బెస్ట్ ఆప్షన్
పాత బెడ్‌షీట్లు క్లీనింగ్ కోసం చాలా బాగా ఉపయోగపడతాయి. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి డస్టింగ్ క్లాత్‌లుగా లేదా నేల తుడవడానికి వాడొచ్చు. ముఖ్యంగా కాటన్ బెడ్‌షీట్లు నీటిని బాగా పీల్చుకుంటాయి కాబట్టి శుభ్రపరిచే పనులు సులభం అవుతాయి. గాజులు, కిటికీలు, టేబుల్‌ల్లు వంటి వాటికి ఇవి బెస్ట్. కొత్త క్లీనింగ్ క్లాత్ కొనాల్సిన అవసరం ఉండదు.
ఇంట్లో ఉన్న పాత కార్డ్‌బోర్డ్ బాక్స్‌లను పాత బెడ్‌షీట్లతో కవర్ చేస్తే అవి స్టైలిష్ స్టోరేజ్ బాక్స్‌లుగా మారతాయి. వాటిలో బట్టలు, టాయ్స్, పుస్తకాలు, మ్యాగజైన్‌లు పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన డిజైన్, కలర్‌ను ఎంచుకుని ఇంటికి డెకరేటివ్ లుక్ ఇవ్వొచ్చు. ఇలా చేయడం వల్ల ఇంటి అందం పెరుగుతుంది, అలాగే ఖర్చు తగ్గుతుంది.
55
క్రియేటివ్ DIY వస్తువుల తయారీ
పాత బెడ్‌షీట్లతో చాలా క్రియేటివ్ పనులు చేయొచ్చు. ఉదాహరణకు షాపింగ్ బ్యాగ్‌లు, కర్టెన్‌లు, పిల్లో కవర్లు, టేబుల్ క్లాత్‌లు తయారు చేయొచ్చు. కొంచెం కుట్టు పని తెలిసి ఉంటే ఇంట్లోనే కొత్త వస్తువులు తయారు చేసుకోవచ్చు. ఇది కేవలం డబ్బు సేవ్ చేయడమే కాదు, మీ క్రియేటివిటీని కూడా పెంచుతుంది. వాడకుండా పడేసే బదులు ఇలా ఉపయోగించడం చాలా మంచి అలవాటు.