Roof Cooling: వేసవిలో ఇంటి పైకప్పు పెనంలా మండిపోతుందా? ఏసీ, కూలర్ ఉన్నా ఉక్కపోత తగ్గట్లేదా? కంగారు పడకండి. ఇదొక్కటి చేస్తే.. ఏసీ లేకుండానే మీ ఇల్లు కూలెక్కిపోద్ది. తక్కువ ఖర్చుతో చల్లగా ఉంచుకోవడానికి ఈ టిప్స్ ట్రై చేయండి
వేసవిలో టాప్ ఫ్లోర్‌లో ఉండేవారికి డాబా వేడెక్కడం పెద్ద సమస్య. ఫ్యాన్ వేసినా వేడి గాలే వస్తుంది. ఇలాంటి టైంలో కింద చెప్పిన కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే మీ ఇల్లు చల్లగా మారిపోతుంది.
25
1. గ్రీన్ నెట్ (Green Net) వాడకం
మనం నర్సరీలలో మొక్కల కోసం వాడే గ్రీన్ నెట్‌ను డాబా పైన కట్టాలి. ఇది సూర్యకిరణాలు నేరుగా పైకప్పుపై పడకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల కింద గదుల్లో ఉష్ణోగ్రత చాలా వరకు తగ్గుతుంది.
35
2. టెర్రేస్ గార్డెన్ (Terrace Garden)
మీకు మొక్కలు పెంచే అలవాటు ఉంటే, డాబా మీద కుండీలు పెట్టండి లేదా చిన్నపాటి తోటను ఏర్పాటు చేసుకోండి. మట్టి, మొక్కలు సూర్యుడి వేడిని పీల్చుకుంటాయి. మొక్కలకు నీళ్లు పోసినప్పుడు 'బాష్పీభవనం' (Evaporation) జరిగి డాబా సహజంగా చల్లబడుతుంది.
ఇది చాలా చవకైన, పక్కా దేశీ చిట్కా. పాత గోనె సంచులను (Jute Bags) డాబా మీద పరవాలి. సాయంత్రం పూట వాటిపై నీళ్లు చల్లితే, డాబా వేడి తగ్గి రాత్రిపూట గది చల్లగా ఉంటుంది.
55
4. నీళ్లు చల్లడం (Water Spraying)
సూర్యుడు అస్తమించాక డాబా మీద నీళ్లు చల్లడం వల్ల వేడి తగ్గుతుంది. కానీ గుర్తుంచుకోండి, మధ్యాహ్నం ఎండలో నీళ్లు చల్లొద్దు. అలా చేస్తే 'హ్యుమిడిటీ' (తేమ) పెరిగి ఉక్కపోత మరింత ఎక్కువ అవుతుంది.