ఇదొక్కటి తింటే చాలు.. కొలెస్ట్రాల్ తో పాటుగా డయాబెటీస్ కూడా కంట్రోల్ లో ఉంటుంది..

Published : Jun 03, 2022, 01:13 PM IST

Cholesterol and Diabetes: మారుతున్న జీవన శైలి, చెబు ఆహారపు అలవాట్ల వల్ల ప్రమాదకరమైన వ్యాధులు సైతం సర్వ సాధారణంగా మారాయి. అందులో కొలెస్ట్రాల్, మధుమేహం ఒకటి. అయితే వీటిని నియంత్రణలో ఉంచేందుకు ఓట్స్ ఎంతో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  

PREV
18
ఇదొక్కటి తింటే చాలు.. కొలెస్ట్రాల్ తో పాటుగా డయాబెటీస్ కూడా కంట్రోల్ లో ఉంటుంది..
High Cholesterol

కొలెస్ట్రాల్ మరియు  డయాబెటిస్ నేడు చాలా మందిని వేధిస్తున్న రెండు ప్రధాన ఆరోగ్య సమస్యలు. అయితే కొన్ని రకాల ఆహారాలు ఈ రెండు సమస్యలను కొంతవరకు నియంత్రించగలవని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.  

28

టైప్ 2 డయాబెటిస్ (Type 2 diabetes), చెడు కొలెస్ట్రాల్ (LDL) తో బాధపడుతున్న వ్యక్తులు ఏమి, ఏవి తినకూడదనే విషయాలు చాలా మందికి తెలియదు. దీంతోనే ఈ సమస్యలు మరింత ఎక్కువ అవుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

38
High Cholesterol

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, బిజీ జీవనశైలి (Busy lifestyle), వేళాపాలలు లేని నిద్రసమయాలు ఇన్సులిన్ అసమతుల్యత, టైప్ 2 డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్ మొదలైన జబ్బుల  ప్రమాదాన్ని పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. 

48

అయితే ఈ రోగాలను తగ్గించడంలో సహాయపడే ఆహారాలలో ఓట్స్ ఒకటి. ఓట్స్  β-గ్లూకాన్ అధికంగా ఉండే కరిగే ఆహార ఫైబర్స్ యొక్క అద్భుతమైన మూలం ఇది. ఇది ప్రాథమికంగా ఒక బయో యాక్టివ్ సమ్మేళనం. ఇది భోజనం తర్వాత గ్లూకోజ్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే శరీరంలో ఇన్సులిన్ ను నియంత్రిస్తుంది.

58

ప్రతిరోజూ ఓట్స్ తినడం వల్ల ఇన్సులిన్ ను నియంత్రించడానికి సహాయపడటమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచడానికి కూడా సహాయపడుతుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది. 

68

ఈ ఓట్స్ ను నాలుగు వారాల పాటు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో గణనీయమైన ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్ ను రక్తప్రవాహంలోకి శోషించుకోవడాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు  గుండె జబ్బుల (Heart disease)ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.
 

78

మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఎన్నో రకాల ఆహారాలు సహాయపడతాయి.కానీ ఓట్ మీల్ శరీరంలోని ఇన్సులిన్ సున్నితత్వాన్ని సమతుల్యం చేయడానికి సహాయపడటమే కాకుండా.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది.
 

88

ఓట్స్ కరిగే ఫైబర్స్ తో నిండిన ధాన్యాలు. వాస్తవానికి 1 కప్పు ఓట్ మీల్ లో సుమారు 8 గ్రాముల ఫైబర్, 51 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 13 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల కొవ్వు మరియు 300 కేలరీలు ఉంటాయి. ఓట్స్ ను ఉప్మాగా, స్మూతీగా లేదా షేక్ తో కలిపి తీసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories